హైదరాబాద్‌లో రూ.5.50 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నామని (drugs seized in hyderabad) నగర సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. 14.2 కిలోల సూడో ఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మాత్రల రూపంలో వీటిని (hyderabad police seized drugs) విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. మత్తు మాత్రలు విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి సుమారు 100 మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక్కో కేజీ విలువ రూ. 41 లక్షలు ఉంటుందని తెలిపారు.
ఎవరికీ అనుమానం రాకుండా ఫొటో ఫ్రేమ్స్‌లలో పెట్టి ప్యాకింగ్ చేశారన్నారు. వీటిని అక్రమంగా ఆస్ట్రేలియాకు పార్సిల్ చేసేందుకు డ్రగ్స్ కొరియర్ చేశారని సీపీ తెలిపారు. అనుమతి లేకుండా మత్తు మాత్రలు విక్రయిస్తున్నారన్న సమాచారంతో.. బేగంపేట పోలీసులు, డీఆర్ఐ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. కొరియర్ కేంద్రంలో తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ మత్తు మాత్రలను కొన్ని యాప్ల ద్వారా విక్రయాలు చేస్తున్నారని గుర్తించామని పోలీసులు తెలిపారు. గోవా నుంచి కొనుగోలు చేస్తున్నట్లు నిందితులు చెబుతున్నారని.. ఈ ప్రాథమిక సమాచారంతో పూర్తిస్థాయి విచారణ చేయాల్సి ఉందన్నారు. పట్టుకున్న ముగ్గురు నిందితులు హైదరాబాద్కు చెందినవారేనని పేర్కొన్నారు. తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నకిలీ ఆధార్ కార్డులతో విక్రయాలు నిర్వహించినట్లు గుర్తించామన్నారు.
ఇదీచూడండి:
Lottie charge on Mahapadayatra: రైతులపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను ఖండించిన తెదేపా నేతలు