Krishnamurthy Antiques Collection : ఒక్కొక్కరికి ఒక్కో ఆసక్తి ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన కృష్ణమూర్తికి కూడా ఓ భిన్నమైన అభిరుచి ఉంది. అదేంటంటే.. ఇత్తడి తదితర లోహాలతో తయారు చేసిన పురాతన సామగ్రిని సేకరించడం. అలా సేకరించిన 900కి పైగా పాత్రలు, వస్తువులతో ఏకంగా తన ఇంటినే మ్యూజియంగా మార్చేశాడీ రిటైర్డ్ ఉద్యోగి. అసలా ఆలోచన ఎలా వచ్చిందంటే - చెన్నైలో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఆయన తాతయ్య చనిపోయాడు. అమ్మమ్మ ఒంటరి కావడంతో ఇంటికి తాళం వేసి తన దగ్గరకు తీసుకెళ్దామనుకున్నాడు. కానీ, ఆమె తనతో పాటు ఇత్తడి, రాగి వంట సామగ్రినీ తెచ్చుకుంటానని పట్టుబట్టడంతో సరేనన్నాడు. అప్పుడు ఆమె మాటల ద్వారా లోహ పాత్రల ప్రాధాన్యం తెలిసొచ్చిందాయనకు. ఆరోగ్యానికి అవి చేసే మేలును భవిష్యత్తు తరాలకూ తెలియజేయాలనుకున్నాడు. అప్పటి నుంచీ వాటి సేకరణ ప్రారంభించి.. నేటికీ కొనసాగిస్తున్నాడు.
ఇదీ చదవండి : jalshakti Department letter: ఆ 11 ప్రాజెక్టులనూ పరిశీలించాకే నిర్ణయం.. రాష్ట్రానికి జల్‌శక్తి శాఖ లేఖ