ETV Bharat / city

SBI Adopts Tigers: 15 పులులను దత్తత తీసుకున్న ఎస్‌బీఐ

Tigers adoption: హైదరాబాద్​లో గల నెహ్రూ జూలాజికల్‌ పార్కులోని 15 పులులను ఎస్‌బీఐ దత్తత తీసుకుంది. జూలోని 15 పులులకు ఏడాది పాటు ఆహారానికి అయ్యే రూ.15 లక్షల చెక్కును ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శోభకు సీజీఎం జింగ్రాన్‌ అందజేశారు.

SBI Adopts Tigers
SBI Adopts Tigers
author img

By

Published : Feb 22, 2022, 9:12 AM IST

Tigers adoption: నెహ్రూ జూలాజికల్‌ పార్కులోని 15 పులులను హైదరాబాద్‌ సర్కిల్‌ భారతీయ స్టేట్‌ బ్యాంకు దత్తత తీసుకుంది. ప్రదర్శనశాలలోని 15 పులులకు ఏడాది పాటు అయ్యే ఆహార ఖర్చును భరించేందుకు ఎస్‌బీఐ ముందుకొచ్చింది. ఇందుకోసం అవసరమైన రూ. 15 లక్షల చెక్కును ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శోభకు సీజీఎం జింగ్రాన్‌ అందజేశారు.

SBI Adopts Tigers
నెహ్రూ జూలాజికల్‌ పార్కులో సేదతీరుతున్న పులులు

అంతరించిపోతున్నజాతుల రక్షణలో భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ భాగస్వామ్యమవుతున్నట్లు సీజీఎం జింగ్రాన్‌ చెప్పారు. దేశంలో ఐఎస్‌ఓ ధ్రువీకరణ పత్రం పొందిన మొదటి జంతు ప్రదర్శనశాలగా ప్రశంసించారు. గడిచిన 10 ఏళ్లుగా పులుల దత్తతకు ఆసక్తి కనపరుస్తున్న ఎస్బీఐకి ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌.శోభ కృతజ్ఞతలు తెలిపారు. వన్యప్రాణుల పరిరక్షణకు ఎస్బీఐ చొరవ చూపుతూ ఉదాత్తంగా ముందుకు రావడం ఇతర కార్పొరేట్‌ సంస్థలకు స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

Minister Gautam Reddy Profile : మాటల్లో సౌమ్యం... మంచితనానికి నిలువెత్తు నిదర్శనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.