ETV Bharat / state

రాష్ట్రానికి రిలయన్స్ రాక - రూ.65వేల కోట్లతో పెట్టుబడుల ప్రణాళికలు - RELIANCE ENERGY INVESTMENT IN AP

మంత్రి లోకేశ్​ కృషితో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి

RELIANCE_ENERGY_INVESTMENT_IN_AP
RELIANCE_ENERGY_INVESTMENT_IN_AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2024, 12:57 PM IST

Reliance Energy Investment RS 65000 Crore in AP for Clean Energy Project : మంత్రి లోకేశ్​ కృషితో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ రూ. 65 వేల కోట్లతో సంసిద్ధతగా ఉంది. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. లోకేశ్​ అమెరికా పర్యటనకు ముందు ముంబయిలో రిలయన్స్ సంస్థతో చర్చలు ఫలవంతమయ్యాయి. గుజరాత్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఆంధ్రప్రదేశ్​లో మాత్రమే ఇంత పెద్దఎత్తున పెట్టుబడులకు సిద్ధమైంది.

సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం : ఏపీలో రిలయన్స్ సంస్థ 500 అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. గత నెలలో రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీని లోకేశ్​ ముంబైలో కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వారికి మంత్రి వివరించారు. రాష్ట్రంలో పెట్టబడులకు సంబంధించి అనంత్ అంబానీ, మంత్రి లోకేశ్​ మధ్య అప్పుడే అవగాహన ఒప్పందం కుదిరింది.

'కొత్త ఆవిష్కరణలకు, కొత్త ఆలోచనలకు వేదికగా ఉంటాం'

రిలయన్స్ పెట్టుబడులపై పరిశ్రమ వర్గాలు ఆనందం : రాష్ట్రంలో పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్​తో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అమరావతిలో ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య అవగాహన ఒప్పందం జరుగనుంది. ఉద్యోగాల కల్పన సబ్ కమిటీ చైర్మన్​గా మంత్రి లోకేశ్​ చొరవతో ఇప్పటికే ఏపీలో సౌర, పవన విద్యుత్ రంగంలో రూ. 40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టాటా పవర్ సిద్ధమైన విషయం అందరికీ తెలిసిందే. స్టీల్ దిగ్గజం ఆదిత్య మిట్టల్​తో ఒక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడిని ఖరారు చేశారు. తాజాగా రిలయన్స్ పెట్టుబడులపై ఏపీ పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రిలయన్స్ సంస్థ పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.50 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరకనుంది.

ఏపీలో టాటాపవర్ రూ.40 వేల కోట్ల పెట్టుబడి - టాటా గ్రూప్ ఛైర్మన్​తో సీఎం భేటీ

ఏపీలో అదానీ గ్రూప్​ భారీ పెట్టుబడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.