ETV Bharat / city

KARVY MD: మరో కేసు.. పోలీసు కస్టడీకి కార్వీ ఎండీ - కార్వీ కేసు

హైదరాబాద్​లోని చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కార్వీ ఎండీ పార్ధసారథిని నాంపల్లి కోర్టు అనుమతితో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించని కేసులో ప్రశ్నించారు. ఇప్పటికే ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసిన కేసులో పార్ధసారథిని సీసీఎస్ పోలీసులు రెండుసార్లు కస్టడీలోకి తీసుకున్నారు.

కార్వీ ఎండీ
కార్వీ ఎండీ
author img

By

Published : Sep 3, 2021, 7:54 PM IST

హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించని కేసులో కార్వీ ఎండీ పార్ధసారథిని సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు. చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్ధసారథిని నాంపల్లి కోర్టు అనుమతితో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రెండు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. బ్యాంకులను మోసం చేసిన వైనంపై సీసీఎస్ పోలీసులు పార్ధసారథిని ప్రశ్నించారు. ఇప్పటికే ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసిన కేసులో సీసీఎస్ పోలీసులు పార్ధసారథిని రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు.

పార్ధసారథిని ప్రశ్నించిన క్రమంలో... బ్యాంకుల నుంచి రుణం తీసుకొని డొల్ల కంపెనీలకు మళ్లించిన విషయం బయటపడింది. దీంతో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ సీఈఓ రాజీవ్ రంజన్ సింగ్, సీఎఫ్ఓ కృష్ణహరిలను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు నుంచి కూడా రూ.347కోట్లు రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదు. బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు మొదటి రోజు కస్టడీలో భాగంగా పలు ప్రశ్నలు వేశారు. ఇప్పటికే కార్వీ ఆడిట్ నివేదికతో పాటు... పార్ధసారథి ఇంట్లో పలు హార్డ్ డిస్క్​లు, పెన్ డ్రైవ్​లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో సమాచారాన్ని విశ్లేషించిన సీసీఎస్ పోలీసులు.. కార్వీ మోసాల గురించి పార్ధసారథిని ప్రశ్నించారు.

కార్వీ ఎండీ పార్ధసారథి ఆదేశాల మేరకు కృష్ణ హరి, రాజీవ్ కలిసి 9 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారు. బ్యాంకుల్లో షేర్లను తనఖా పెట్టి తీసుకున్న కోట్ల రూపాయల రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లించారు. ఆ తర్వాత డొల్ల కంపెనీల్లో రూ.300 కోట్లు నష్టం వచ్చినట్లు చూపించారు. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్... ఇండస్ ఇండ్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఎండీ పార్ధసారథిని ఇదివరకే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపించారు.

పెట్టుబడిదారులకు చెందిన షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి నిబంధనలకు విరుద్ధంగా భారీగా రుణం తీసుకున్నారు. ఈ విషయం సెబీ దృష్టికి వెళ్లడంతో 2019లో కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్​ను నిషేధించింది. దీంతో షేర్లను తనఖా పెట్టుకొని రుణం ఇచ్చిన బ్యాంకులకు రికవరీ చేసుకోవడం ఇబ్బందిగా మారింది. రూ.137 కోట్లు రుణం ఇచ్చిన ఇండస్ ఇండ్ బ్యాంకు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మార్చి31వ తేదీన కేసు నమోదు చేశారు. గత నెల 19న హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు పార్ధసారథిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. పార్ధసారథిని రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని బ్యాంకు మోసం గురించి ప్రశ్నించారు. కార్వీ అడిట్ నివేదికపైనా ప్రశ్నిం

ఇదీ చదవండి: KARVY: కార్వీ ఛైర్మన్‌ పార్థసారథి నాంపల్లి సీసీఎస్​కు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.