ETV Bharat / city

తెలంగాణ: బయటికొస్తే... బండి పోలీస్​ స్టేషన్​కే!

author img

By

Published : Apr 8, 2020, 1:44 PM IST

లాక్​డౌన్​ మరింత కఠినంగా అమలు చేసేందుకు హైదరాబాద్​ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఇన్ని రోజులూ వాహనాలు రోడ్లపైకి వస్తే హెచ్చరించి వదిలేశారు. ఇక నుంచి అలా కుదరదు. చిన్న చిన్న కారణాలతో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించే వారి వాహనాలు ఇకపై పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. తిరిగి లాక్​డౌన్​ ఎత్తివేశాకే అప్పగిస్తారు.

hyd traffic-police-introduced-new-regulations

వైద్య సంబంధ, అత్యవసర కారణాలు మినహా చిన్న, చిన్న కారణాలు చెబుతూ రోడ్లపైకి వచ్చే వారిపై హైదరాబాద్​ పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. వాహనదారులు ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తుండటంతో మంగళవారం వరకూ హెచ్చరికలతో సరిపెట్టారు. ఇకపై వాహనాలను స్వాధీనం చేసుకొని... లాక్​డౌన్​ ఎత్తివేశాకే తిరిగివ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్​లోని ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, పాతబస్తీ ప్రాంతాల్లో మంగళవారం వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా ట్రాఫిక్‌ పోలీసులకు ఆదేశాలిచ్చారు. మంగళవారం ప్రతి కూడలి వద్ద గంటగంటకూ ట్రాఫిక్‌ పరిస్థితిని పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకూ వాహనదారులను ఆపి హెచ్చరించి ఇళ్లకు పంపించారు.

చట్టం తీవ్రత తెలుసుకోండి

లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవల వాహనాలు మినహా ఎవరూ రోడ్లపైకి రాకూడదని చట్టం చెబుతోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 15 రోజులుగా కేసులు నమోదు చేస్తున్నాం. వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నా కొందరు తీవ్రతను తెలుసుకోవడం లేదు. రోడ్లపై అకారణంగా తిరిగేందుకు బైక్‌లు, కార్లలో వచ్చిన వారిపై ఐపీసీ సెక్షన్‌ 188 ప్రకారం కేసులు నమోదు చేసి వారి వాహనాలను స్వాధీనం చేసుకోనున్నాం.

- ఎస్‌.అనిల్‌కుమార్‌, హైదరాబాద్​ అదనపు కమిషనర్​(ట్రాఫిక్‌)

ఇదీ చూడండి: కరోనా కోసమని ఆ మాత్ర వాడితే చూపు తగ్గుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.