ETV Bharat / city

Lok Adalat: లోక్‌అదాలత్‌కు విశేష స్పందన.. ఒక్కరోజే 85 వేల కేసుల పరిష్కారం - cases solved in lok adalat

Lok Adalat: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌కు మంచి స్పందన లభించింది. కేవలం ఒక్కరోజులోనే 85,863కి పైగా కేసులు పరిష్కారమయ్యాయి.

Lok Adalat
Lok Adalat
author img

By

Published : Mar 13, 2022, 9:15 AM IST

Lok Adalat: రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్‌అదాలత్‌కు విశేష స్పందన లభించింది. ఒక్కరోజే 85,863కి పైగా కేసులు పరిష్కారమయ్యాయి. వాటిలో 42,899 పెండింగ్‌, 42,964 ప్రీ లిటిగేషన్‌ కేసులున్నాయి.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో శనివారం 434 లోక్‌అదాలత్‌ బెంచ్‌లను నిర్వహించారు. హైకోర్టు ప్రాంగణంలో జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కె.విజయలక్ష్మి, జస్టిస్‌ ఎం.గంగారావు, జస్టిస్‌ చీమలపాటి రవి లోక్‌అదాలత్‌ బెంచ్‌లను నిర్వహించారు. లోక్‌అదాలత్‌ విజయవంతమవడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు ఏపీ న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి చిన్నంశెట్టి రాజు, హైకోర్టు న్యాయ సేవాధికార సంఘం కార్యదర్శి ఎంవీ రమణకుమారి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి :

Polavaram: పోలవరం స్పిల్ వేలో మిగిలిన ఆరు గేట్ల పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.