ETV Bharat / city

Devotees rush in Bhadradri and Yadadri temples: భద్రాద్రి, యాదాద్రి ఆలయాల్లో భక్తుల రద్దీ.. - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

Yadadri temple rush: వరుస సెలవులతో తెలంగాణలోని యాదాద్రి, భద్రాద్రిలో రద్దీ పెరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో స్వామి వారి ధర్మ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. జనంతో ఆలయ పరిసరాలు.. లడ్డుకౌంటర్లు కిటకిటలాడాయి.

Devotees rush in Bhadradri and Yadadri temples
భద్రాద్రి, యాదాద్రి ఆలయాల్లో భక్తుల రద్దీ...
author img

By

Published : Dec 25, 2021, 6:32 PM IST

Yadadri temple rush: వరుసగా సెలవులు రావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. నారసింహుని దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి అరగంటకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. లడ్డూ కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. కొండకింద కల్యాణ కట్ట, సత్యనారాయణ మండపం జనాలతో నిండిపోయింది. స్వామివారి నిత్యపూజలు, నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తులు

yadadri temple news: మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయ భద్రత దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు. కొండ కింద ఘాట్ రోడ్ వెంట భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుంటున్నారు. వైకుంఠ ద్వారం వద్ద వాహనాల రద్దీ నెలకొంది. వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు.. వాహనాలను వేరేవైపుగా మళ్లించారు.

గండిచెరువుకు హంగులు..
sri lakshmi narasimha swamy temple reconstruction: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మహాదివ్యంగా తీర్చిదిద్దే క్రమంలో....... కొండకింద గండిచెరువును తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. పంచనారసింహుల ఆలయోత్సవాల్లో భాగంగా.....తెప్పోత్సవ నిర్వహణకు అనుగుణంగా..... చెరువులో మట్టితీత, తూము నిర్మాణపనులు చేపడుతున్నారు. పలుచోట్ల నుంచి క్షేత్ర సందర్శన కోసం వచ్చే యాత్రికులకు ఆహ్లాదాన్ని కలిగించే తీరులో... గండిచెరువును సుందరీకరించే పనుల్లో భాగంగా తూము నిర్వహణ చేపట్టినట్లు డీఈ బాలకృష్ణ తెలిపారు. కొండకింద ఉత్తరదిశలో గండిచెరువు చుట్టూ బండ్‌నిర్మాణంతో పాటు పరిసరాల్లో పచ్చదనం పెంచుతున్నారు. సుమారు రూ.40 కోట్ల అంచనాతో సుందరీకరణ పనులు చేపట్టారు. చెరువు నుంచి ప్రతి రెండు, మూడునెలలకు ఒకసారి నీటిని దిగువకు వదిలేలాల తూము నిర్మితమవుతోందని అధికారులు తెలిపారు.

ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం..
Laser Show in Yadadri: యాదాద్రీశుడిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికుల్లో భక్తి భావాలను పెంపొందిస్తూ... మానసిక పునరుత్తేజానికి దోహదడేట్లు ఆలయాన్ని తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. ఆ క్రమంలోనే యాడా, ఆలయనిర్వాహకులు ఆలయాన్ని పునర్​నిర్మిస్తున్నారు. ఆలయ గోపురాలపై క్షేత్ర చరిత్రను తిలకించేలా... లేజర్‌ షోను అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం రాత్రి కొండపై ప్రధానాలయం మాడ వీధిలో ప్రయోగాత్మక ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

లక్ష్మి పుష్కరిణికి.. రంగుల హంగులు!
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్​కు చెందిన ఓ సంస్థ బీటీ కన్వర్జన్స్ ద్వారా లేజర్ కిరణాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. దీంతో యాదాద్రికి వచ్చే భక్తులు మరింత ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆలయ గోపురాలపైనే గాకుండా అష్టభుజి మండప ప్రాకారాలపై వాటి విశిష్టత, ఆలయ చరిత్రను ఆకర్షణీయమైన చిత్రాలతో ప్రదర్శించనున్నారు.యాదాద్రి పుణ్యక్షేత్రంలో పునర్నిర్మితమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు కావడంతో అధికారులు పనుల వేగవంతానికి చర్యలు చేపట్టారు. కొండ కింద గండి చెరువు పరిసరాల్లో రూ.11.55 కోట్లతో 2.13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన లక్ష్మి పుష్కరిణిని రంగులతో తీర్చిదిద్దుతున్నారు. విద్యుదీకరణ పనులు పూర్తి కావొచ్చాయి.

భద్రాచలంలో.. భక్తుల సందడి !!
devotees crowd in bhadrachalam: భద్రాచలం భక్తుల రాకతో సందడిగా మారింది. వరుస సెలవులు రావడంతో ఒక్కసారిగా భద్రాద్రికి రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతాలు కిక్కిరిసి పోయాయి. భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి కదిలి రావడంతో క్యూలైన్లి భక్తులతో నిండిపోయాయి.

devotees in bhadradri: ముఖ్యంగా శనివారం కావడం వల్ల ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు బంగారు తులసీదళాలతో అర్చన చేశారు. ప్రతి రోజు జరిగే నిత్య కళ్యాణ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జిలకర్ర బెల్లం, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు చూసి తిలకించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:
TTD Covid Restrictions: ఆ పత్రం ఉంటేనే.. తిరుమలకు భక్తుల అనుమతి: తితిదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.