రాష్ట్రంలో వర్షాలు అన్నదాతలను మరోసారి కోలుకోలేని దెబ్బతీశాయి. అనంతపురం జిల్లాలో.... పంటలు నీటమునిగాయి. కొన్నిచోట్ల …పొలాల్లో పైరు తేలియాడుతోంది. బొమ్మనహాల్ మండలం గోవిందవాడలో వేరుశనగ పూర్తిగా నీటమునగింది. చేతికందే సమయంలో పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల, నందికొట్కూరు, శ్రీశైలం పరిధిలో వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
గుంటూరు జిల్లా రేపల్లె, నిజాంపట్నం మండలాల్లోని తీరప్రాంత గ్రామాల్లో వందల ఎకరాల పంట పూర్తిగా నీటమునిగింది. ప్రధాన పంట కాలువల్లో పూడికలు తీయకపోవడంతో గుర్రపు డెక్క, గడ్డి పెరిగి.. వరద నీరు పొలాల్నిముంచెత్తింది. అధికారులు మురుగుకాల్వలు తప్ప.. పంటకాల్వల గురించి పట్టించుకోవట్లేదనిరైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇక వానజోరు తగ్గినా పలుచోట్ల ప్రజలకు వరద కష్టాలు తప్పడంలేదు. పెన్నానది ఉద్ధృతికి కడప జిల్లా పెన్నపేరూరు, తప్పెటవారిపల్లెలో ఇళ్లలోకి నీరు చేరింది. కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని మద్దిలేరువాగు ఉద్ధృతికి పి.వి.నగర్, భీమవరం, ఎర్రగుంట్లకు రాకపోకలు.. నిలిచాయి. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గుండేరు డ్రైన్‌లో వరద తగ్గడంతో ముంపు బాధితులు తేరుకుంటున్నారు గుండేరు గండ్లు పూడ్చాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: