ETV Bharat / city

pmay: ప్రతి అయిదింటిలో ఒక ఇల్లు రాష్ట్రానికే.. - పీఎంఏవై పథకం ఏపీ ప్రయోజనం వార్తలు

దేశవ్యాప్తంగా గత అయిదేళ్లలో పేదలందరికీ ఇళ్లు పథకం కింద కేంద్రం 1.12 కోట్ల ఇళ్లను మంజూరు చేయగా అందులో 20.36 లక్షల ఇళ్లను రాష్ట్రానికి కేటాయించింది. ఇప్పటివరకు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) పథకం కింద ఎక్కువ ఇళ్లు ఏపీకే మంజూరయ్యాయి. ప్రతి అయిందిటిలో ఓ ఇళ్లు రాష్ట్రానికి మంజూరైంది.

house schemes in ap
house schemes in ap
author img

By

Published : Jul 12, 2021, 5:14 AM IST

పేదలందరికీ ఇళ్లు పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు మంజూరు చేసిన ఇళ్లలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే వచ్చాయి. దేశవ్యాప్తంగా గత అయిదేళ్లలో 1.12 కోట్ల ఇళ్లను మంజూరు చేయగా అందులో 20.36 లక్షల ఇళ్లను రాష్ట్రానికి కేటాయించింది. దాదాపు ప్రతి అయిదు ఇళ్లలోనూ ఒకటి రాష్ట్రానికే దక్కింది. దేశంలో అర్హులైన పేదలందరికీ సొంత గూడు కల్పించాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) పథకం కింద 2015-16 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇళ్లను మంజూరు చేస్తోంది. నిర్మాణానికి కేంద్ర వాటాగా ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు ఆర్థిక సాయం ఇస్తోంది. మొత్తంగా రాయితీలో రూపంలో కేంద్రం రూ.30 వేల కోట్లు అందించనుంది. వీటిని 2022 జూన్‌ నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం.

* ఆంధ్రప్రదేశ్‌ తర్వాత 17.26 లక్షల గృహాలతో ఉత్తర్‌ప్రదేశ్‌ రెండోస్థానంలోనూ, 13.13 లక్షల గృహాలతో మహారాష్ట్ర మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఈ పథకం కింద తెలంగాణకు 2.23 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. గత అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన 20.36 లక్షల ఇళ్లలో ఇప్పటికే 4.61 లక్షల గృహాలు పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరో 14.56 లక్షల ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయి. వీటిలో టిడ్కో గృహాలు కూడా ఉన్నాయి.

యూడీఏల ఏర్పాటుతో అత్యధిక ఇళ్లు

పీఎంఏవై (పట్టణ) పథకం కింద కేంద్రం.. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)ల్లో పేదలకు ఇళ్లను మంజూరు చేస్తుంది. కేంద్ర సాయాన్ని గరిష్ఠంగా వినియోగించుకోవాలనే ఆలోచనతో గత ప్రభుత్వ హయాంలో నాలుగుగా ఉన్న యూడీఏల సంఖ్యను 12కు పెంచారు. ఇటీవల కొత్తగా మరో యూడీఏను ఏర్పాటు చేయడంతోపాటు మరికొన్నింటి పరిధిని పెంచారు. దాదాపు రాష్ట్రంలోని 175 నియోజవర్గాల్లో 8 మినహా మిగతావన్నీ పాక్షికంగా లేదా పూర్తిగా యూడీఏలుగా మారాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఇళ్లు లేని పేదలను గుర్తించి కేంద్రానికి నివేదించడంతో అత్యధికంగా ఇళ్లు మంజూరయ్యాయి.

స్థలం కేటాయించిన రాష్ట్రం

రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఉచితంగా స్థలాలిచ్చి జగనన్న కాలనీల్లో చేపట్టే 15.10 లక్షల ఇళ్లు కేంద్రం మంజూరు చేసినవే. వీటిలో 13.15 లక్షల ఇళ్లు 2019 తర్వాత మంజూరు కాగా మిగతావి అంతకంటే ముందు కేటాయించినవి. వీటి నిర్మాణానికి స్థలం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది. ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రూ.1.80 లక్షల రాయితీలో కేంద్ర సాయం రూ.1.50 లక్షలు. పట్టణ ప్రాంతాల్లో రూ.30 వేలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా యూడీఏల్లో ఈ మొత్తాన్ని వేతనాల రూపంలో ఉపాధి హామీ పథకం నుంచి లబ్ధిదారులకు అందిస్తున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థలో అక్రమాలపై సీఐడీ దర్యాప్తు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.