ఏపీ హైకోర్టులో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏడుగురు న్యాయమూర్తులను హైకోర్టు న్యాయవాదుల సంఘం బుధవారం ఘనంగా సన్మానించింది. శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసింది. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీ రామిరెడ్డి, కార్యవర్గం నేతృత్వంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది హాజరయ్యారు. సన్మానం అందుకున్న వారిలో జస్టిస్ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు, జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్, జస్టిస్ బండారు శ్యాంసుందర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్, జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ(బీవీఎల్‌ఎన్) చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ఉన్నారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ.. బార్ అండ్ బెంచ్(న్యాయవాదులు, న్యాయమూర్తులు) న్యాయవ్యవస్థకు రెండు చక్రాలు లాంటివారన్నారు. ఇద్దరు సమన్వయంతో పనిచేస్తే వ్యాజ్యాలు వేగంగా పరిష్కారం అవుతాయన్నారు. విచారణకు న్యాయవాదుల సహకారం అందించాలని కోరారు.
ఇదీ చదవండి: