దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత చమురు సంస్థలు ధరలను పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.109.10, డీజిల్ రూ 95.40పైసలకు చేరింది.
మరోవైపు రాష్ట్రంలో పెట్రోల్‌పై 88 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెరిగింది. ఫలితంగా విజయవాడలో పెట్రోల్ రూ.110.80, డీజిల్ రూ.96.83గా ఉంది. గుంటూరులో పెట్రోల్ రూ.111.21, డీజిల్ రూ.97.26కు చేరింది.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే రోజురోజుకూ చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండటంతో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరికొన్ని రోజుల పాటు చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: Gas Price Hike: గ్యాస్ 'ధరల మంట'... ఏయే జిల్లాలో ఎంతంటే..!