వాల్మీకి చిత్రం విడుదలను నిలువరించడానికి హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ ను కొట్టివేసింది. బోయల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న వాల్మీకి చిత్రం పేరును తొలగించేలా...ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ... 'ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం ప్రధాన కార్యదర్శి నాయుడు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... వాల్మీకిని బోయలు ఆరాధ్యదైవంగా భావిస్తారన్నారు. ఆ పేరుతో తీసిన ఈ చిత్రంలో కథానాయకుడిని రౌడీగా, దోపిడీదారుగా చిత్రీకరించారని పేర్కొన్నారు. చిత్రం పేరుపై అభ్యంతరాన్ని... సెన్సార్ బోర్డు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. ఈనెల 20వ తేదీన సినిమా విడుదల కాకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. అందుకు నిరాకరించిన ధర్మాసనం అనుబంధ పిటిషన్ను కొట్టేసింది.
ఇదీ చూడండి:'జీవోలపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు'