ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాజధానిలో ఆర్​-5 జోన్​ ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను 4 వారాల పాటు హైకోర్టు సస్పెండ్ చేసింది.

high court suspended amaravathi r5 zone gazette notification

author img

By

Published : May 15, 2020, 7:38 PM IST

Updated : May 15, 2020, 8:49 PM IST

రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీకి ఉద్దేశించిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని.. రాజధాని రైతులు గతంలో హైకోర్టులో పిటిషన్ వేశారు. ​ రాజధాని మాస్టర్ ప్లాన్​లో మార్పులు చేయాలంటే.. ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరని.. స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల అభిప్రాయాలు సేకరించాలని.. పిటిషనర్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేసి.. విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.

ఏమిటీ ఆర్‌5 జోన్‌?
రాజధాని మాస్టర్​ ప్లాన్​ ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉండేవి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్‌-1 (ప్రస్తుత గ్రామాలు), ఆర్‌-2 (తక్కువ సాంద్రత గృహాలు), ఆర్‌-3 (తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు), ఆర్‌-4 (హైడెన్సిటీ జోన్‌) పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి. అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తూ ఇటీవలే ప్రకటన చేసింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.

ఇదీ చదవండి: కరోనా 'దండోరా'... కర్ణాటకలో అడుగుపెట్టొద్దు..!

Last Updated : May 15, 2020, 8:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.