High court on Woman missing: ఓ ఆర్థిక వివాదం విషయంలో స్టేషన్‌కు రావాలని పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం పోలీసులు రమ్మనడంతో తన భార్య ఏప్రిల్ 20న ఠాణాకు వెళ్లిందని, అప్పటి నుంచి ఆమె కనిపించడంలేదంటూ ఎం.రవిప్రసాద్ అనే వ్యక్తి మే 4న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది టీవీ సుమన్ వాదనలు వినిపిస్తూ.. ఆ మహిళ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారని, కొంత సమయం కావాలని అన్నారు.
పోలీసుల వ్యవహార శైలిపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. ఈ విషయాన్ని అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన కోర్టు.. ఆమెను ఠాణాకు పిలిపించాల్సిన అవసరం ఏముందని పోలీసులను నిలదీసింది. కోర్టుకు హాజరైన సంబంధిత ఎస్సై బదులిస్తూ.. తాము ఠాణాకు పిలవలేదన్నారు. ఆమె కోసం వెతుకుతున్నామని తెలిపారు. ఆ మహిళ ఆచూకీ కోసం ఇప్పటి వరకు చేసిన యత్నాలేమిటో అఫిడవిట్ ద్వారా తెలియజేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న ఎం.శ్యాంకుమార్ అనే వ్యక్తికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: