HIGH COURT: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, ఆ వివరాలను మెమో రూపంలో కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని దేవాదాయ శాఖ ప్రభుత్వ న్యాయవాది రజనీరెడ్డి హైకోర్టుకు తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం విచారణను ఈనెల 22 కు వాయిదా వేసింది. తితిదేకి 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోలపై హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ఆ జీవో అమలును నిలుపుదల చేస్తూ గత సెప్టెంబర్ 22 న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఇదీ చదవండి: ఏబీజీ షిప్‌యార్డు ఛైర్మన్‌పై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు