ETV Bharat / city

అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు చర్యలు ఎందుకు తీసుకోలేదు?: హైకోర్టు - హైకోర్టు తాజా వార్తలు

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టులను తొలగించేందుకు.. చర్యలు ఎందుకు తీసుకోలేదని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. కేసు నమోదు చేసి ఏడాదవుతున్నా నిందితులందర్నీ అరెస్ట్‌ చేయకపోవడం, సామాజిక మాధ్యమాల్లోని వీడియోలను తొలగించేందుకు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే  మీపై అనుమానం కలుగుతోందని సీబీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Oct 28, 2021, 4:33 PM IST

Updated : Oct 29, 2021, 4:31 AM IST

న్యాయవ్యవస్థను, హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన నిందితుల పక్షాన నిలబడుతున్నారా? అని సీబీఐని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కేసు నమోదు చేసి ఏడాదవుతున్నా నిందితులందర్నీ అరెస్ట్‌ చేయకపోవడం, సామాజిక మాధ్యమాల్లోని వీడియోలను తొలగించేందుకు చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే మీపై అనుమానం కలుగుతోందని సీబీఐని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మీ తీరు నిందితులు మరిన్ని వీడియోలను పోస్టు చేయడానికి ప్రోత్సహిస్తున్నట్లు ఉందని పేర్కొంది. సీఐడీ నుంచి దర్యాప్తును స్వీకరించగానే మొదట చేయాల్సిన పని.. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజారుస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులను తొలగించడం కాదా అని నిలదీసింది. వీడియోలు తొలగించాలని యూఆర్‌ఎల్‌ వివరాలను సామాజిక మాధ్యమ సంస్థలకు ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తు చేస్తున్నా.. సుమోటోగా కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసి హైకోర్టు విచారణ జరుపుతున్నా ‘పంచ్‌ ప్రభాకర్‌’ నిరంతరం సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని గుర్తుచేసింది. విదేశాల్లో ఉన్న అతడ్ని అరెస్ట్‌ చేసేందుకు చర్యలెందుకు తీసుకోలేదని నిలదీసింది. ప్రభాకర్‌కు నోటీసిచ్చి భారతదేశం రండి అరెస్ట్‌ చేస్తామంటే వస్తారా? మీరే వెళ్లి పట్టుకురావాలని స్పష్టం చేసింది. తీర్పులిచ్చిన ప్రతీసారి దూషణలకు న్యాయస్థానాలు లక్ష్యంగా మారుతున్నాయని పేర్కొంది. వీధుల్లోకి వెళ్లి మేం కొట్లాడలేం కదా అని వ్యాఖ్యానించింది. సామాజిక మాధ్యమ సంస్థలు, సీబీఐ.. అభ్యంతరకర పోస్టుల కట్టడికి చర్యలు తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నించింది. దీనిపై ఇప్పటివరకు ఏం చేశారో శుక్రవారం కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని విశాఖలోని సీబీఐ ఎస్పీని ఆదేశించింది.

న్యాయవ్యవస్థపై, ఏపీ న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులకు సంబంధించిన యూఆర్‌ఎల్‌ వివరాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్‌/ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చిన అనంతరం న్యాయవ్యవస్థపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై హైకోర్టు అప్పటి ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ జనరల్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. 2020 అక్టోబర్‌ 12న దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. గురువారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది.

సీబీఐ వైఫల్యమే: పిటిషనర్‌
పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపించారు. ‘సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవడంలో సీబీఐ విఫలమైంది. అందువల్లే పంచ్‌ ప్రభాకర్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా నిరంతరం న్యాయమూర్తులను కించపరుస్తూ వీడియోలు పెడుతున్నారు. గూగుల్‌, యూట్యూబ్‌, వాట్సప్‌, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలను సంబంధిత వీడియోలు, పోస్టులు తొలగించేలా ఆదేశించండి. మళ్లీమళ్లీ పోస్టులు పెడుతుంటే ఆటోమేటిగ్గా తొలగించే విధానం తీసుకొచ్చేలా ఆదేశించండి’ అని కోరారు.

యూఆర్‌ఎల్‌ ఐడీ ఇస్తే తొలగిస్తాం
వాట్సప్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌, ఫేస్‌బుక్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, యూట్యూబ్‌, గూగుల్‌ తరఫున న్యాయవాది అహ్లువాలియా, ట్విటర్‌ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వీడియోలు అర్హమైనవా? కాదా? తేల్చే యంత్రాంగం తమ వద్ద లేదన్నారు. పోస్టులు పెట్టకుండా కట్టడి చేయలేమన్నారు. న్యాయస్థానం లేదా దర్యాప్తు సంస్థలు యూఆర్‌ఎల్‌ నంబర్‌ ఇచ్చి.. ఆ వీడియోలను తొలగించాలని కోరితే తీసేస్తామన్నారు. సీబీఐ న్యాయవాది సుభాష్‌ వాదనలు వినిపిస్తూ ఈ వ్యవహారంలో 11 మందిని అరెస్ట్‌ చేయగా అయిదుగురు బెయిల్‌పై విడుదల అయ్యారన్నారు. అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు కేంద్రంతో సంప్రదిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న పంచ్‌ ప్రభాకర్‌కు నోటీసులు జారీ చేశామని, ఇంటర్‌పోల్‌కు లేఖ రాశామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుతం నా స్వరాష్ట్రం. రాష్ట్రంలోని వ్యవస్థలను దుర్భాషలాడటం అంటే.. ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతినీ, ప్రజల జీవన విధానాన్నీ కించపరచడమే. నాపైన, హైకోర్టుపైన, ఇతర ఏ వ్యవస్థలపైన అభ్యంతరకర పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా మొత్తం ఆంధ్రప్రదేశ్‌పై చేసినవిగా పరిగణిస్తాను.

- సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర హెచ్చరిక

ఇదీ చదవండి:

ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్​ఎస్​ రావత్​పై హైకోర్టు ఆగ్రహం

Last Updated : Oct 29, 2021, 4:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.