ETV Bharat / city

విశాఖ స్టీల్​పై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం - High Court on Visakha Steels

High Court on Visakha Steels విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌లపై హైకోర్టు విచారణ జరిపింది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విరుద్దమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తరపున న్యాయవాది వాదించారు.

hc
hc
author img

By

Published : Aug 29, 2022, 5:54 PM IST

High Court on Visakha Steels: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌‌లపై హైకోర్టు విచారణ జరిపింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కు విరుద్దమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తరపున న్యాయవాది వాదించారు. 22 వేల ఎకరాలు తీసుకొని 9,200 మంది రైతులకు నేటి వరకూ ఉద్యోగాలు ఇవ్వలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని కోర్టుకు తెలిపారు. ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా అనేక మార్గాలు కూడా ప్రతిపాదించామని చెప్పారు. వాదనలు విన్న న్యాయస్థానం కేంద్రం, ఆర్​ఐఎన్​ఎల్​, రాష్ట్ర ప్రభుత్వం, వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ అథారిటీకి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తుది విచారణను సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.