ETV Bharat / city

పరిషత్ పోరు.. ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ

రేపే పరిషత్ పోరు.. ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ

author img

By

Published : Apr 7, 2021, 3:08 PM IST

Updated : Apr 8, 2021, 6:27 AM IST

14:41 April 07

తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఫలితాలను ప్రకటించవద్దు

రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు బుధవారం హైకోర్టు ధర్మాసనం అనుమతిచ్చింది. సింగిల్‌ జడ్జి వద్ద వ్యాజ్యం పరిష్కారం అయ్యేటంత వరకు ఓట్ల లెక్కింపు.. ఫలితాల ప్రకటన చేయవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్‌ఈసీ) స్పష్టం చేసింది. పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను నిలువరిస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈనెల 6న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) విధించలేదని పిటిషనర్‌, వ్యాజ్యంలో పూర్తి స్థాయిలో కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం లేదని ఎస్‌ఈసీ వివిధ అంశాల్ని లేవనెత్తిన నేపథ్యంలో లోతైన విచారణ అవసరమని అభిప్రాయపడింది. వివాదాస్పద అంశాల్ని తేల్చాల్సి ఉందని పేర్కొంది. తెదేపా నేత వర్ల రామయ్య దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి వద్ద ఈనెల 15న విచారణకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.  

సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు మంగళవారం రాత్రి అత్యవసరంగా అప్పీల్‌ దాఖలు చేయగా... దానిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఇందులోభాగంగా... ‘సింగిల్‌ జడ్జి నిర్ణయాన్ని పరిశీలిస్తే మధ్యంతర ఉత్తర్వులిస్తూనే.. రిట్‌ పిటిషన్ను అనుమతిచ్చినట్లయింది. రిట్‌ పిటిషన్‌ విచారణ పెండింగ్‌లోనే ఉంది. తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఎస్‌ఈసీని ఆదేశించడం చూస్తుంటే తుది ఉత్తర్వులిచ్చినట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చాక నిర్వహించిన గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విషయంలో కోడ్‌ను నాలుగు వారాల పాటు విధించలేదన్న విషయాన్ని సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. వ్యాజ్యం దాఖలు చేసే అర్హత పిటిషనర్‌కు ఉందా లేదా అన్నది నిర్ధిష్టంగా తేల్చలేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సింగిల్‌ జడ్జి ఆదేశాల్ని రద్దు చేస్తున్నాం. ఈనెల 8న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తున్నాం...’ అని ధర్మాసనం పేర్కొంది.

ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది- ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి

‘తెదేపా నేత వర్ల రామయ్య జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కాదు. వ్యక్తిగత ప్రయోజనం లేనప్పుడు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదు. నిష్పాక్షిక ఎన్నికల కోసం దాఖలు చేసినట్లయితే అది ప్రజాహిత వ్యాజ్యం అవుతుంది. దానిపై ధర్మాసనం విచారణ జరపాలి. సింగిల్‌ జడ్జి విచారించకూడదు...’ అని ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘ఓసారి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యాక కొనసాగనివ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. పిటిషనర్‌ అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేయడంతో పూర్తి స్థాయిలో కౌంటర్‌ వేయడానికి వీల్లేకుండా పోయింది. కేవలం ప్రాథమిక కౌంటర్‌ మాత్రమే వేశాం. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియను కొనసాగేందుకు వీలు కల్పించండి...’ అని కోరారు.

నోటిఫికేషన్‌ ప్రతుల్ని దాఖలు చేయకపోవడంపై అసంతృప్తి
కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్య

ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందని పిటిషనర్‌ రిట్‌ రూపంలో ఎందుకు సవాలు చేయకూడదని ఎస్‌ఈసీని ప్రశ్నించింది. గతంలో జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రతుల్ని కోర్టుకు సమర్పించకుండా అప్పీల్‌ వేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. ప్రతుల్ని భౌతికంగా అప్పటికప్పుడు అందజేస్తామని ఎస్‌ఈసీ న్యాయవాది కొంత సమయం కోరారు. అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు చెప్పారు. నిర్ధిష్ట సమయంలో ఆ ప్రతులు కోర్టుకు అందకపోవడంతో మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని ఎస్‌ఈసీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

సుప్రీం ఉత్తర్వులకు విరుద్ధంగా కోడ్‌ సమయాన్ని కుదించారు
పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ

ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేసిన హైకోర్టు సింగిల్‌ జడ్జి.. అందుకు కారణాల్ని స్పష్టంగా పేర్కొన్నారని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ తన వాదనలను వినిపించారు. ‘పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ను పునర్‌ విధించాలని సుప్రీంకోర్టు సుస్పష్టంగా ఆదేశాలిచ్చింది. ఈ విషయంలో ఎస్‌ఈసీకి విచక్షణాధికారం ఇచ్చినట్లు కాదు. ఈనెల 1న నోటిఫికేషన్‌ ఇచ్చి...  8న పోలింగ్‌ తేదీ అని ఎస్‌ఈసీ పేర్కొంది. తద్వారా సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కోడ్‌ విధింపు సమయాన్ని కుదించారు. రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయడంపై ఎస్‌ఈసీ అభ్యంతరం చెప్పడం సరికాదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవద్దు...’ అని కోరారు.

కరోనా టీకాపై పూర్తి స్థాయిలో దృష్టి సారించొచ్చు: ఏజీ ఎస్‌ శ్రీరామ్‌

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ..‘ఎస్‌ఈసీ వాదనలతో ఏకీభవిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ పూర్తి అయితే కరోనా టీకా ఇచ్చే కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించొచ్చు. ఎన్నికల ప్రక్రియలో సింగిల్‌ జడ్జి జోక్యం చేసుకోకుండా ఉండాల్సిందని’ పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఎన్నికల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. లోతైన విచారణ జరిపే అంశాన్ని హైకోర్టు సింగిల్‌ జడ్జికి అప్పగించింది.

ఇదీ చదవండి: జగన్ కేసు తేల్చే బాధ్యత నా మీద వేసుకున్నా: రఘురామకృష్ణరాజు

Last Updated : Apr 8, 2021, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.