HC On Kuna Ravikumar Petition: తనను పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారంటూ.. తెదేపా నేత కూన రవికుమార్ దాఖలుచేసిన పిటీషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. రవికుమార్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన డీఎస్పీ, ఇతర పోలీసులకు నోటీసు ఇచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అరెస్టు చేసే క్రమంలో సుప్రీంకోర్టు నిబంధనలను పాటించాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. పోలీసులను దూషించారనే ఆరోపణతో గతేడాది నవంబర్ 21న కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:
అశోక్‌బాబు అరెస్టుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. సీఐడీకి హైకోర్టు ఆదేశాలు