ఎమ్మార్ వ్యవహారంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కోనేరు ప్రదీప్ వేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. సోదరుడు కోనేరు మధుపై కేసు తొలగించడాన్ని ప్రదీప్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. మధుపై విచారణ నిలిపివేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఈడీ పేర్కొంది. వాదనల అనంతరం క్వాష్ పిటిషన్‌పై విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.
ఎమ్మార్ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కోనేరు మధు దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ జి.శ్రీదేవి విచారణ చేపట్టారు. వాదనలు విన్న ధర్మాసనం కోనేరు మధుపై ఈడీ కేసు విచారణను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా విచారణ ప్రక్రియపై స్టే మంజూరు చేసింది.
ఇదీ చదవండి..
ramakrishna: 'ప్రజాధనం దుర్వినియోగంపై సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలి'