కేసుతో సంబంధం లేని అధికారి శశిభూషణ్ కుమార్‌ను కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చిన పిటిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధం లేని అధికారిని ప్రతివాదిగా చేర్చి అసౌకర్యానికి గురిచేయడమే కాక.. న్యాయస్థానం సమయాన్ని వృథా చేశారంటూ పిటిషనర్‌కు 10 వేల రూపాయలు జరిమానా విధించింది.
ఆ మొత్తాన్ని ఐఏఎస్ అధికారికి 2 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు జారీచేసే నాటికి జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎవరు విధులు నిర్వహిస్తున్నారో వారిని ప్రతివాదిగా చేర్చేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇచ్చింది. శశిభూషణ్ కుమార్ పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగించిన కోర్టు.. విచారణను ఆగస్టు 9 కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: