ETV Bharat / city

డాక్టర్ సుధాకర్​ను కోర్టు ఎదుట హాజరుపరచండి: హైకోర్టు

డాక్టర్ సుధాకర్‌ను తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకులుగా వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది పి. వీరారెడ్డిని నియమించింది.

author img

By

Published : May 19, 2020, 1:25 PM IST

high-court-on-doctor-sudhakar-issue
high-court-on-doctor-sudhakar-issue

విశాఖలో డాక్టర్ సుధాకర్​తో వ్యవహరించిన తీరుపై తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. వీడియో క్లిప్పింగ్​ను జత చేసి పంపించారు. లేఖను రిజిస్ట్రార్ జ్యుడీషియల్.. పిల్ కమిటీ ముందు ఉంచారు. లేఖను పిల్​గా పరిగణించవచ్చని హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన పిల్ కమిటీ స్పష్టం చేసింది. దీనిని సుమోటో పిల్​గా పరిగణించి ధర్మాసనం విచారణ జరిపింది.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ డాక్టర్ సుధాకర్ అంశాన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని అభ్యంతరం తెలిపారు. రాజకీయాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవడం తగదన్నారు. ఎడిట్ చేసిన వీడియోను అనిత హైకోర్టుకు పంపారన్నారు. పీఎం, సీఎంని సుధాకర్ దూషించిన వీడియోలుండగా వాటినెందుకు లేఖతో జత చేయలేదని ప్రశ్నించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ.. డాక్టర్ సుధాకర్​ను హాజరుపరచాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: విశాఖలో దారుణం..డాక్టర్​ను కట్టేసి పోలీస్​స్టేషన్​కు తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.