telugu in government offices: ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు వినియోగం, అధికార భాషా చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కౌంటర్ వేయాలని... ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీచేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై..హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అర్ధం కాని భాషలో దస్త్రాల నిర్వహణతో పాలనలో ప్రజల్ని భాగస్వాములు కాకుండా చేయడమేనని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
జీవోలు, ప్రజా సమస్యలపై తీసుకునే నిర్ణయాలను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు. ప్రజల భాషే.. ప్రభుత్వ పాలన భాషగా ఉండాలని అన్నారు. తెలుగు భాషాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , సాధారణ పరిపాలన శాఖ, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీచేసింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి:
సినిమా చూపించలేను మావా..! ఆందోళనలో ఏపీ ఎగ్జిబిటర్లు.. అసలేం జరుగుతోంది..?