ETV Bharat / city

హైకోర్టులో గ్రూప్​ 1 అభ్యర్థుల అప్పీళ్లు కొట్టివేత - 2018 గ్రూప్ 1 వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు

ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్​లో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో తప్పులు దొర్లాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ వ్యాజ్యాలపై సింగిల్ జడ్జి విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. దానిని సవాలు చేస్తూ ధర్మాసం ముందు అప్పీల్ చేయగా.. న్యాయస్థానం కొట్టివేసింది.

high court dismisses 2018 group 1 candidates appeals
హైకోర్టులో గ్రూప్​ 1 అభ్యర్థుల అప్పీళ్లు కొట్టివేత
author img

By

Published : Mar 5, 2021, 8:43 AM IST

గ్రూప్-1 పరీక్ష విషయంలో దాఖలైన రెండు అప్పీళ్లను.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఇటీవల జరిగిన విచారణలో వాదనలు పూర్తి కాగా.. ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తిరిగి పరీక్ష నిర్వహించేందుకు నిరాకరిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

2018 డిసెంబర్​లో 169 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ప్రాథమిక పరీక్షలోని 120 ప్రశ్నల్లో.. ఆంగ్లం నుంచి తెలుగు అనువాదానికి సంబంధించి 51 తప్పులున్నాయని, నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్లను అనుమతించలేదని.. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పరీక్షను రద్దు చేసి తాజాగా మరోసారి నిర్వహించాలని పిటిషన్​లు దాఖలు చేశారు. అందుకు నిరాకరిస్తూ.. గతేడాది అక్టోబర్ 22న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దానిని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. ప్రశ్నాపత్రంలో దొర్లిన తప్పులకు.. అభ్యర్థులు అందరికీ సమానంగా మార్కులు ఇచ్చినట్లు ఏపీపీఎస్సీ తరపు న్యాయవాది వాదించారు. ఇదే అంశంపై దాఖలైన ఆప్పీళ్లలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

జిల్లాల్లో జోరుగా తెదేపా నేతల ప్రచారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.