రేషన్ వాహనాల రంగులపై ప్రభుత్వం వేసిన పిటిషన్ మీద హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలను పరిశీలించి.. వాటి రంగులు మార్చాలని అధికారులకు తెలిపామని ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు.
వాహనాల రంగులపై పలు పార్టీలు ఫిర్యాదులు చేశాయన్నారు. వాటిపై ప్రస్తుతం వేరే రంగులు ఉన్నా.. వైకాపా జెండా రంగులే అధికంగా ఉన్నాయని చెప్పారు. పథకం నిలువరిస్తామని తాము చెప్పలేదని.. రంగులు మార్చితే అనుమతిస్తామని తెలిపినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.
ఇదీ చదవండి: