గ్రామ న్యాయాలయాల ఏర్పాటుపై వారంలోగా నిర్ణయాన్ని వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సమాచారం ఇచ్చేందుకు విఫలమైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శులు నేరుగా కోర్టులో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్ర న్యాయాలయాలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కే. మహేశ్వరి, యు.దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం... ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ దిశగా త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఏజీపీ హైకోర్టుకు వివరించారు. అనంతరం... వచ్చే వారానికి విచారణ వాయిదా పడింది.
ఇదీ చదవండి : ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకొండి: సీఎం జగన్