ETV Bharat / city

పేదల కోసం.. న్యాయ సహాయ ఉద్యమం : జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర

హైకోర్టు న్యాయ సేవల కమిటీ చేపట్టిన ‘మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌’ కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర.. హైకోర్టు ప్రాంగణంలో మంగళవారం ప్రారంభించి ప్రసంగించారు. ‘మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌’ కార్యక్రమాన్ని పేదలకు న్యాయం అందించే.. న్యాయ సహాయ ఉద్యమంగా అభివర్ణించారు.

high court cj in mission legal service programme

author img

By

Published : Nov 10, 2021, 8:59 AM IST

‘మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌’ కార్యక్రమాన్ని పేదలకు న్యాయం అందించే న్యాయ సహాయ ఉద్యమంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర అభివర్ణించారు. న్యాయ సహాయం(లీగల్‌ ఎయిడ్‌) కార్యక్రమం విజయవంతం కావడానికి న్యాయ విద్యార్థులు వెన్నెముక లాంటి వారన్నారు. ప్రజలకూ న్యాయ వ్యవస్థకూ మధ్య వారధిలా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలు, నిరుపేదలకు న్యాయ సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఏపీ హైకోర్టు న్యాయ సేవల కమిటీ చేపట్టిన ‘మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌’ కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర హైకోర్టు ప్రాంగణంలో మంగళవారం ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమంలో భాగంగా న్యూదిల్లీ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌ను ప్రారంభించినట్లు చెప్పారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి, సత్తెనపల్లి, ప్రత్తిపాడు, తుళ్లూరు, కృష్ణా జిల్లా పెనమలూరు మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాలను న్యాయసేవాధికార సంస్థలు దత్తత తీసుకొని మిషన్‌ లీగల్‌ సర్వీసెస్‌ను ప్రారంభిస్తాయన్నారు. ఆ గ్రామాల్లో న్యాయసేవల కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమం తర్వాత.. దత్తత తీసుకున్న రెవెన్యూ గ్రామాల పర్యటనకు సిద్ధం చేసిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మంగళవారం నియమితులైన జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా మాట్లాడుతూ పేదల హక్కుల రక్షణకు పలు చట్టాలున్నా వాటిపై ప్రజలకు అవగాహన ఉండటం లేదన్నారు. అవగాహన కల్పించే బాధ్యత న్యాయ విద్యార్థులు తీసుకోవాలన్నారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆరు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఎనిమిది న్యాయ కళాశాల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, న్యాయ విద్యార్థులు, 41 మంది న్యాయవాదులు కమిటీల్లో సభ్యులుగా ఉన్నారన్నారు. లీగల్‌ సర్వీస్‌ కమిటీ కార్యదర్శి ఎంవి రమణకుమారి మాట్లాడుతూ 2019లో ఈ కమిటీ ద్వారా 304 మందికి న్యాయ సహకారం అందించామన్నారు. 53 మందికి సుప్రీంకోర్టులో కేసులు వేయడానికి సహకరించామని.. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న 4వేల కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించామన్నారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు జానకిరామిరెడ్డి, సిద్ధార్థ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ సిహెచ్‌.దివాకర్‌బాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, న్యాయవిద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: petrol rates: పెట్రో వాతపై హారన్ల మోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.