కరోనా సమయంలో న్యాయవ్యవస్థ అంతా.. ఓ కుటుంబంలా అందరూ ఒకరికొకరు తోడుగా సహకరించుకుంటూ పనిచేయాలని హైకోర్టు తెలిపింది. ఈ కష్టకాలంలో న్యాయవ్యవస్థకు మూల స్తంభాలైన న్యాయాధికారులు, సిబ్బందికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తరఫున ఈ సందేశాన్ని తెలియజేస్తున్నానన్నారు. హైకోర్టు, దిగువ న్యాయస్థానాలకు సంబంధించిన న్యాయమూర్తులు, సిబ్బంది.. వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేయవలసిన సమయం వచ్చిందన్నారు.
సారాంశం
'ప్రజల హక్కుల్ని కాపాడే విషయంలో కోర్టులు పనిచేయడం తప్పనిసరి అనేది గుర్తించుకోవాలి. ఆరోగ్య , పురపాలక , నీటి సరఫరా , విద్యుత్ , పోలీసు తదితర విభాగాలు ముందు వరసలో ఉండి పనిచేస్తున్న తరహాలోనే న్యాయవ్యవస్థ పనిచేయాలి. న్యాయ సేవలను నిరాకరించలేము. కరోనా అంటువ్యాధి అని , చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతోందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనకున్న సమాచారం ప్రకారం ఏపీలో కరోనాను ఎదుర్కొని కోలుకున్న వారు 98 శాతం కంటే ఎక్కు ఉంది. హైకోర్టు అధికారులకు , సిబ్బందికి చేసిన పరీక్షల్లో 26 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వారందరు నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ 26 మంది ఆరోగ్యస్థితి పై వ్యక్తిగతంగా హైకోర్టు రిజిస్ట్రార్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు. కరోనా విషయమై రాష్ట్రంలోని వైద్యులు , డీఎంహెచ్ వో ఐ.రమేశ్, మెడికల్ ట్రైనీల జిల్లా అధికారి అమృత తదితరులతో హైకోర్టు సీజే చర్చించారు. జీవన విధానాన్ని మార్చుకోవడం, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనాను ఎదుర్కొనగలమని వైద్య బృందం తెలిపింది. ముఖాన్ని తాకకుండా ఉండటం, రోజుకు 8 నుంచి 10 సార్లు సబ్బుతో చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం పాటించడం, గోరువెచ్చని నీటిలో నిమ్మరసంతో రోజుకు రెండు సార్లు తీసుకోవడం, తదితర చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం మనో ధైర్యాన్ని పెంచుకుంటూ.. మానవత్వాన్ని చూపాల్సిన ఆవశ్యకత ఉంది. కరోనా బాధితుల పట్ల అపోహల్ని తొలగించుకుంటూ సరైన వైద్య పరిజ్ఞానంతో సలహాలు ఇవ్వాలి. వారిని మనతో కలుపుకుపోవడం ఈ సమయంలో ఎంతైనా అవసరమం' అని హైకోర్టు రిజస్ట్రార్ ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: