ETV Bharat / city

TG HIGH COURT: పెద్దలే కరోనా నిబంధనలు పాటించట్లే.. పిల్లలు పాటిస్తారా?

క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలనూ అధ్యయనం చేయకుండా...మార్గదర్శకాలు రూపొందించకుండా పాఠశాలలను తెరుస్తున్నామని ఎందుకు ప్రకటించారని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హాజరును తప్పనిసరి చేస్తున్నారా? కొవిడ్‌ మార్గదర్శకాలను ఏవిధంగా అమలు చేస్తున్నారని అడిగింది. పెద్దలే భౌతిక దూరం పాటించడంలేదు. పిల్లలు దీన్ని అమలు చేయటం కష్టమని తెలిపింది.

high-count-serious
high-count-serious
author img

By

Published : Jun 24, 2021, 9:33 AM IST

తెలంగాణలో కరోనా చికిత్సలకు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పాఠశాలలను ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌నూ విచారించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. ‘‘జులై 1 నుంచి విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలవుతాయి. పిల్లలు పాఠశాలకు హాజరుకావాలంటే తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి. కొవిడ్‌ మొదటి విడతప్పుడు ఫిబ్రవరిలోపాఠశాలలు తెరిచాం. అప్పట్లోనూ హాజరు తప్పనిసరి చేయలేదు. తల్లిదండ్రుల అనుమతితోనే పిల్లలు స్కూళ్లకువచ్చార’’ని వివరించారు.

ఆన్‌లైన్‌ తరగతుల గురించీ స్పష్టత ఇవ్వండి

‘‘మార్గదర్శకాలు రూపొందించే ముందు పిల్లలను దృష్టిలో ఉంచుకోవాలి. పెద్దలే భౌతిక దూరం పాటించడంలేదు. పిల్లలు దీన్ని అమలు చేయడం కష్టం. అంతేగాకుండా పాఠశాలలు చిన్నచిన్న స్థలాల్లో...ఇరుకు గదుల్లో ఉంటాయి. తల్లిదండ్రుల ఆందోళనను కూడా గమనంలోకి తీసుకోవాలి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మార్గదర్శకాలను రూపొందించి నివేదికను సమర్పించండి. ఆన్‌లైన్‌ తరగతుల గురించి కూడా స్పష్టత ఇవ్వండి’’ అని ధర్మాసనం విద్యాశాఖను ఆదేశించింది.

10 మంది అనాథ పిల్లలకు ఓ అధికారి

‘‘రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌తో 170 మందికి పైగా పిల్లలు అనాథలయ్యారు. ప్రతి 10 మంది పిల్లలకు ఒకరు లేదా ఇద్దరు అధికారులను బాధ్యులుగా గుర్తించాలి. వారి ఫోన్‌ నంబర్లను పిల్లలకు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. ఈమేరకు చర్యలు తీసుకోవాలి’’ అని హైకోర్టు ఆదేశించింది. ‘‘కొవిడ్‌ సమయంలో గృహ హింస కేసులు ఎక్కువయ్యాయి. ఒకటి రెండు గదులుండే అపార్ట్‌మెంట్‌లలో కుటుంబాలు ఉంటున్నాయి. పిల్లలకు ఆన్‌లైన్‌ తరగతులు ఇతర సమస్యలతో గృహిణులపై హింస పెరుగుతోంది. వారు బయటికి వస్తే ఆశ్రయం కల్పించడానికి ఏర్పాట్లు ఉండాలి. దీనిపై వచ్చే నివేదికలో స్పష్టతనివ్వాలి. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలపై డీజీపీ సమర్పించిన నివేదికలో కొత్త అంశాలేవీ లేవు. గత నివేదికలోని అంశాలను యథాతథంగా పేర్కొన్నారు’’ అని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. విచారణను జులై 7వ తేదీకి వాయిదా వేసింది.

  • ప్రైవేటు ఆసుపత్రులు కరోనా రోగుల నుంచి అధికంగా వసూలు చేసిన మొత్తానికి కనీసం 10 రెట్ల అధికంగా జరిమానా విధించే అంశాన్ని పరిశీలించాలి. దీనికి అనుగుణంగా ప్రస్తుత జీవోను సవరించాలి. లేదంటే ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాలి. ఇలా జరిమానా విధిస్తేనే అవి దారికొస్తాయి.
  • కొవిడ్‌ మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కరోనా పరీక్షల సంఖ్య తగ్గించకుండా చూడాలి. మూడో దశతోపాటు డెల్టా వేరియంట్‌ను ఎదుర్కోవడానికి రూపొందించిన ప్రణాళికను సమర్పించాలి.
  • ఇప్పటికే 5 లక్షల మందిని కొవిడ్‌ పరంగా హైరిస్క్‌ గ్రూపుగా గుర్తించారు. పాఠశాలలు తెరుస్తున్నందున ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని కూడా ఈ కేటగిరీలోకి తీసుకోవాలి.

- తెలంగాణ హైకోర్టు

రుసుములను రిసెప్షన్‌ వద్ద ప్రదర్శించాలి

కొవిడ్‌ చికిత్సలకు సంబంధించి ఈనెల 22న జారీ చేసిన జీవోను పరిశీలించిన ధర్మాసనం దాని అమలుకు కార్యాచరణ ఏమిటో చెప్పాలంది. ‘‘జీవోలో పేర్కొన్నదానికంటే ఎక్కువ వసూలు చేస్తే ఏం చర్యలు తీసుకుంటారో అందులో లేదు. ప్రతి ప్రైవేటు ఆసుపత్రిలో రిసెప్షన్‌ వద్ద, అకౌంటెంట్‌ వద్ద దేనికి ఎంత రుసుమో ప్రముఖంగా కనిపించాలి. ఈ జీవోపై విస్తృత ప్రచారం నిర్వహించాలి’’ అని ఆదేశించింది. వైద్యఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీ గురించి ప్రస్తావించలేదని, భర్తీకి ఏం చర్యలు తీసుకుంటున్నారో వచ్చే నివేదికలో చెప్పాలంది. ‘‘ఆసుపత్రులపై మొత్తం 350 ఫిర్యాదులు అందాయి. 22 వైద్యశాలల లైసెన్సును రద్దు చేశాం. వివరణ తీసుకున్నాక పునరుద్ధరించాం. 30 ఫిర్యాదులను పరిష్కరించాం. సుమారు రూ.72 లక్షలు వాపసు ఇప్పించాం’’ అని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. న్యాయవాదులు జోక్యం చేసుకుంటూ అధిక ఫీజులు వసూలు చేసే ఆసుపత్రులపై ఎక్కువ జరిమానా విధించే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

ఇదీ చూడండి: పెట్రో ధరల పెరుగుదల.. ఒక్కో ఎకరాపై రూ.3వేల వరకు భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.