దేవాలయాల్లో పొరుగుసేవల ఉద్యోగులను ఏపీసీఓఎస్ ద్వారా నియమించుకోవాలని దేవాలయాల ఈవోలను ఆదేశిస్తూ.. ఆ శాఖ కమిషనర్ గతేడాది జులై 28న జారీ చేసిన మెమోను హైకోర్టు రద్దు చేసింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను సంపూర్ణంగా వర్తింపజేస్తే.. హిందూమతాన్ని ఆచరించనివారు.. హిందూ దేవాలయాల్లో ఉద్యోగులు లేదా సేవకులుగా నియమితులు కావొచ్చని తెలిపింది. ఏపీ దేవదాయ చట్టం సెక్షన్ 13, 23, 29, 35 ప్రకారం.. హిందూమతాన్ని ఆచరించని వారిని దేవాలయాల్లో ఉద్యోగులుగా నియమించకూడదని పేర్కొంది. దేవాలయాలు, మతసంస్థల విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదని స్పష్టం చేసింది. అవి ప్రభుత్వానికి చెందినవి కావు కాబట్టి.. వాటిని ఆప్కాస్ పరిధిలోని తీసుకురావడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. గతేడాది దేవదాయశాఖ కమిషనర్ ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ తాడేపల్లిగూడానికి చెందిన న్యాయవాది వేసిన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. దాన్ని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి:
HC ON HOUSE TAX: మూలధన విలువ ఆధారిత ఆస్తి పన్ను జీవోపై విచారణ