Summer safety tips: ఎండలో తిరిగేవాళ్లు రోజుకు 4 లీటర్ల వరకు నీళ్లు తాగాలని తెలంగాణలోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు సూచించారు. ఇంట్లో ఉండేవాళ్లు రోజు 3లీటర్ల వరకు నీళ్లు తాగాలని తెలిపారు. బయటకు వెళ్లేప్పుడు నూలు దుస్తులు, టోపీ ధరించాలని పేర్కొన్నారు. ఎండలో పనిచేసేవాళ్లు గంటకొకసారి నీడ పట్టున విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.
ఎక్కువ జ్వరం ఉంటే వెంటనే ఆస్పత్రికి తరలించాలని.. లోబీపీ, వణకటం వంటి సమస్యలున్నా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ రాజారావు అన్నారు. కొబ్బరి నీళ్లు సహా మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగాలని తెలిపారు. పిల్లలను ఎండలో ఆడుకోవడానికి పంపకూడదని.. ఆహారం మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినకూడదని స్పష్టం చేశారు. కూరగాయలు, ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి :
inter exams: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ఘనంగా ఏఆర్ రెహ్మాన్ కుమార్తె పెళ్లి.. వరుడు ఎవరంటే?