ETV Bharat / city

లాక్‌డౌన్‌ వేళ పేదలకు అండ

author img

By

Published : Apr 17, 2020, 6:25 AM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమవుతున్న ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు మేమున్నామంటూ చాలా మంది ముందుకొస్తున్నారు. వివిధ రూపాల్లో సాయం చేస్తూ ఆపదలో అండగా నిలుస్తున్నారు.

helping people
helping people

కృష్ణా జిల్లా కంచికచర్లలో నిరుపేదలకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నిత్యావసర వస్తువులు, కూరగాయల పంపిణీ చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని శ్రీ సత్య సాయి విద్యా విహార్ స్కూలులో పనిచేస్తున్న సిబ్బందికి శ్రీ సత్యసాయి ప్రేమ సదన్ మందిరం నిర్వాహకులు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఆన్ లైన్ లో గదులను అద్దెకిచ్చే 'పోబైట్' అనే సంస్థ నిర్వాహకులు రెడ్ జోన్లలో పనిచేసే వాలంటీర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.శ్రీకాకుళం జిల్లా రాజాంలో దాతలు సమకూర్చిన 28 రకాల నిత్యావసర వస్తువులను 500 మంది పేద కుటుంబాలకు పోలీసులు పంపిణీ చేశారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలో చీరల వ్యాపారుల సంఘం, తారక్ చేయూత ట్రస్ట్ ఆధ్వర్యంలో హోంగార్డులకు , వార్డు మహిళ పోలీసు కార్యదర్శులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ధర్మవరం డి.ఎస్.పి రమాకాంత్ చేతుల మీదుగా సరుకులు అందజేశారు . ఆర్.డి.టి స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన పిలుపునకు స్పందించిన అనంతపురం జిల్లా రైతన్నలు తాము పండించిన పంటలను,ఇంట్లో ఉన్న ధాన్యం ను పేదల కడుపు నింపటానికి అందించారు. గుంతకల్లు, వజ్రకరూర్ మండలంలోని గ్రామాల ప్రజలు ధాన్యం,కాయగూరలు,నిత్యావసర వస్తువులు అందించారు. కడప జిల్లా రైల్వేకోడూరులోని రైల్వే స్టేషన్ వద్ద పేదలకు యువకులు భోజన ఏర్పాట్లు చేశారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకూ పేదలకు అన్నదానం చేస్తామన్నారు.

ఉపాధి లేని 100మంది విభిన్న ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి నిత్యావసరాల కోసం 600 రూపాయలు ఆర్ధిక సాయం చేయనున్నట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు తెలిపారు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం కాకర్లకు చెందిన 200 కూలీలకు భాజపా నాయకుడు దేవదానదివాకర్ కూరగాయలు పంపిణీ చేశారు. శ్రీ షిర్డీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో పురపాలక సంఘం కార్మికులకు భోజన వసతి కల్పించారు. ఐడియాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. 17వ వార్డులో వైకాపా నాయకుడు జాకీర్ కూరగాయలు పంచారు.

ఇవీచదవండి: లాక్‌డౌన్‌ తో నష్టపోతున్న పూలసాగుదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.