ETV Bharat / city

AP RAINS: రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి - ap news updates

AP RAIN
AP RAIN
author img

By

Published : Sep 7, 2021, 6:29 AM IST

Updated : Sep 7, 2021, 2:17 PM IST

11:53 September 07

వరాహనది ఉద్ధృతికి కోతకు గురైన గట్టు

  • విశాఖ: ఎస్.రాయవరం మం. సోముదేవుపల్లి వద్ద వరాహనది ఉద్ధృతి
  • విశాఖ: సోముదేవుపల్లి వద్ద వరాహనది ఉద్ధృతికి కోతకు గురైన గట్టు

11:29 September 07

విశాఖ: హుకుంపేట-అడ్డుమండ మార్గంలో వంతెనపై వరద నీటి ప్రవాహం

.

11:02 September 07

సీతపల్లి వాగులో కొట్టుకుపోయిన గిరిజన యువకుడు

  • తూ.గో.: రంపచోడవరం మండలంలో సీతపల్లి వాగు ఉద్ధృతి
  • చేపల కోసం వెళ్లి సీతపల్లి వాగులో కొట్టుకుపోయిన గిరిజన యువకుడు
  • చెట్టును పట్టుకుని ఆపదలో ఉన్న యువకుడిని కాపాడిన పోలీసులు
  • యువకుడిని బయటకు తీసిన బందమామిడి గ్రామస్థులు, అగ్నిమాపక సిబ్బంది

11:01 September 07

కాట్రావులపల్లి జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో నిలిచిన వర్షపు నీరు

  • తూ.గో.: కాట్రావులపల్లి జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో నిలిచిన వర్షపు నీరు
  • వరద నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

10:11 September 07

కొంగవారిగూడెం వద్ద ఎర్ర కాల్వ జలాశయానికి వరద

  • జంగారెడ్డిగూడెం మం. కొంగవారిగూడెం వద్ద ఎర్ర కాల్వ జలాశయానికి వరద
  • ప.గో.: రెండు గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల వరద నీటి విడుదల
  • దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు

10:04 September 07

పోలవరం మండలంలో నక్కలపేట, రాళ్లకొండ వాగుల ఉద్ధృతి

  • ప.గో.: పోలవరం మండలంలో నక్కలపేట, రాళ్లకొండ వాగుల ఉద్ధృతి
  • కొండవాగు ఉద్ధృతికి తోటగొంది పునరావాస కాలనీ వద్ద దెబ్బతిన్న కాల్వ
  • ప.గో.: సరిపల్లి వద్ద కొత్తూరు పునరావాస కాలనీలో నిలిచిన విద్యుత్‌ సరఫరా
  • 24 గంటలుగా విద్యుత్ సరఫరా లేదంటూ నిర్వాసితుల ఆందోళన
  • ప.గో.: కొయ్యలగూడెంలో 7.6 సెం.మీ. వర్షపాతం నమోదు
  • ప.గో.: టి.నరసాపురం-మక్కెనవారిగూడెం మధ్య చింతల వాగు ఉద్ధృతి

10:04 September 07

భూపతిపాలెం జలాశయం 3 గేట్లు ఎత్తి 1000 క్యూసెక్కులు విడుదల

  • తూ.గో.: రాజవొమ్మంగి మండలం లబ్బర్తి వద్ద పెద్దేరు ఉద్ధృతి
  • తూ.గో.: జడ్డంగి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మడేరు వాగు
  • తూ.గో.: ఏజెన్సీలో నిండుకుండలా మారిన జలాశయాలు
  • భూపతిపాలెం జలాశయం 3 గేట్లు ఎత్తి 1000 క్యూసెక్కులు విడుదల

10:04 September 07

తమ్మిలేరు జలాశయం నుంచి నీటి విడుదల

  • కృష్ణా: చాట్రాయి మం. తమ్మిలేరు జలాశయం నుంచి నీటి విడుదల
  • కృష్ణా: తమ్మిలేరు జలాశయం నుంచి 4 వేల కుసెక్కులు విడుదల
  • తమ్మిలేరు పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

08:27 September 07

తూర్పుగోదావరి జిల్లాలో పొంగి పొర్లుతున్న కొండ వాగులు

మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో..  జలాశయాలు నిండుకుండలా మారాయి. కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపతిపాలెం, ముసురుమిల్లి, సూరంపాలెం, మద్దిగడ్డ జలాశయాల్లో అధికంగా నీరు వచ్చి చేరింది. 204 మీటర్ల సామర్ధ్యం కలిగిన భూపతిపాలెం జలాశయంలోకి మంగళవారం తెల్లవారుజామున పూర్తిస్థాయిలో నీటి మట్టం చేరడంతో ప్రాజెక్టు జె.ఈ చంద్రకాంత్‌.. మూడు గేట్లు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సీతపల్లి వాగులోకి విడుదల చేశారు. పందిరిమామిడి నుంచి వాడపల్లి వెళ్లే రహదారిలో కొండ వాగులు పొంగి ప్రవహించాయి. అలాగే కాకవాడ నుంచి ఆకూరు వెళ్లే రహదారిలో పలు వాగులు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. వరదల కారణంగా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం లోనూ, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోనూ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

08:26 September 07

భారీ వర్షాలతో ముంపుకు గురైన వరి పొలాలు

భారీ వర్షాలతో విశాఖలో ముంపుకు గురైన వరి పొలాలు

కొద్ది రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో.. వరి పొలాలు ముంపునకు గురయ్యాయి. రోలుగుంట మండలం లోని రోలుగుంట , కొవ్వూరు, వెదుల్లవలస, బాగాపురం , కొమరవోలు ప్రాంతాల్లో.. సుమారు 75 ఎకరాలకు పైగా వరి పొలాలు నీట మునిగాయి. రోలుగుంటలో కొత్తచెరువు పొర్లు కట్టు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో దిగువనున్న పొలాలన్నీ నీటిలో నానుతున్నాయి. గొలుగొండ మండలం కరక ప్రాంతంలో చెరువులకు గండ్లు పడ్డాయి.

06:34 September 07

విశాఖలో లోతట్టు ప్రాంతాలు జలమయం

  • విశాఖ మన్యంలో ఎడతెరిపిలేని వర్షం
  • వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం
  • రాయ్‌గెడ్డ వంతెన పైనుంచి ప్రవహిస్తున్న నీరు
  • 50 గిరిజన గ్రామాలకు నిలిచిన రాకపోకలు

06:18 September 07

ఏపీలో భారీ వర్షాలు... కోస్తాలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు

rains
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం
  • బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 
  • మరో రెండ్రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం 
  • ఇవాళ అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
  • నేడు ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు
  • రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం 

Last Updated : Sep 7, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.