ETV Bharat / city

రాష్ట్రంలో భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ఉత్తరకోస్తా, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీవ్ర వాయుగుండం కారణంగా.. ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన ప్రభుత్వం.. సహాయకచర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించింది.

ap rains
ap rains
author img

By

Published : Oct 13, 2020, 9:56 AM IST

Updated : Oct 13, 2020, 1:43 PM IST

రాష్ట్రంలో భారీవర్షాలు.. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

వాయుగుండం ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షపాతం భారీగానే నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 24.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. విశాఖ, కృష్ణా జిల్లాలో 20సెంటిమీటర్ల వరకు వర్షం కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో 24.3, రాయవరంలో 22.7 సెంటీమీటర్లు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 20.2, శ్రీకాకుళం జిల్లాలో 17 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.

కృష్ణా జిల్లాలో..

అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెంపల్లి, వీఎన్ పురం కాలనీ, కొత్తగూడెం గ్రామాల్లోని కాలనీల్లోకి మోకాళ్ళ లోతు నీరు చేరడంతో జనజీవనానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏలూరు, బుడమేరు, రివస్ కాలువలు.. వరదతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

విజయవాడ శివారు రాజీవ్‌నగర్ కట్టప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. సమీపంలో బుడమేరు కాల్వ పొంగటంతో వరద నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశ్‌నగర్, ఎల్బీఎస్ నగర్‌లో రెండు అడుగుల మేర వరద నీరు చేరింది. బుడమేరు వరద తగ్గితేనే మోటార్లు పెట్టి వరద నీటిని తోడుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

విశాఖ జిల్లాలో..

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోట తీరం ఉప్పుటేరు పొంగి మత్స్యకారుల బోట్లు సముద్రంలోకి కొట్టుకు పోయాయి. జిల్లాలో పలుచోట్ల రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. గాలుల తీవ్రతకు పలు విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నెలకొరిగాయి. చాలాచోట్ల రాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అరకు-జీడిపల్లి మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. తెన్నేటి పార్క్ వద్దకు తీరానికి బంగ్లాదేశ్ వాణిజ్య నౌక ఎంవీ మా హెచ్ .టీ. 194 కార్గో కొట్టుకువచ్చింది. ఎలమంచిలిలో పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి. అనంతగిరి మండలంలో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి కొన్నిచోట్ల వృక్షాలు విరిగిపడ్డాయి. 30 గిరిజన గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

తూర్పుగోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించింది. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. వాయుగుండం ప్రభావం.. ఉప్పాడ తీరంపై తీవ్రంగానే చూపింది. విస్తారంగా కురుస్తున్న వానలకు.. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో కొన్ని ఇళ్లు కోతకు గురయ్యాయి. భారీ గాలుల ప్రభావానికి పలుచోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

జిల్లాలోని తీర ప్రాంతాలు వణికిపోయాయి. ప్రస్తుతం వర్షం ప్రభావం తగ్గుముఖం పట్టినప్పటికీ అక్కడక్కడ జల్లులు కురుస్తునే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో నీరు నిలిచిపోయి .. జనజీవనానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.రాజమహేంద్రవరంలోని లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. కోటిపల్లి బస్టాండ్ , ఐఎల్​టీడీ జంక్షన్ , కంబాలచెరువు, రైల్వేస్టేషన్ రోడ్డు నీట మునిగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్ల పైకి రావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రి నుంచి కురిసిన వానకు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. బొమ్మూరులో గోడ కూలి మహిళ మృతిచెందింది. తునిలో తాండవ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కాకినాడలో పలు కాలనీలోని ఇళ్లల్లోకి నీరు చేరటంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. పరిస్థితి తెలిసికూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భారీ వర్షానికి వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం ముంపుకు గురైంది. క్యూలైన్లు, దర్శనం టికెట్లు తీసుకునే ప్రాంతాలు, స్వామివారి హుండీల వద్ద సైతం నీరు చేరింది. శివాలయం ప్రాంగణాలు కూడా వర్షపు నీటిలో మునిగింది. గర్భగుడిలోని శివలింగం వద్దకు సైతం నీరు చేరింది.

గుంటూరు జిల్లాలో..

గుంటూరు జిల్లాలో వర్ష ప్రభావంతో జనజీవనానికి ఇబ్బందిగా మారింది. గుంటూరు నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. తాడేపల్లి, ఉండవల్లి, తుళ్లూరు, పెనుమాక ప్రాంతాల్లో వర్షాల కారణంగా పంట పొలాల్లోకి నీరు చేరింది. మిరప, కంద పంట పొలాలు మునిగాయి. పెదపరిమి-తుళ్లూరు మధ్య కొట్టేళ్ల వాగు పొంగి ప్రవహిస్తోంది. ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వట్టిచెరుకూరు మండలంలో మిర్చి పంట నీటి మునిగింది. నరసరావుపేట, భట్టిప్రోలులో తెల్లవారుజాము నుంచి గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. సత్తెనపల్లి మండలం వెన్నాదేవి వద్ద గండి వాగు ఉద్ధృతి కారణంగా సత్తెనపల్లి-పిడుగురాళ్ల మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

పశ్చిమగోదావరి జిల్లాలో..

పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, టి.నర్సాపురం, తడికలపూడి, గోపాలపురం, కొయ్యలగూడెం, కొవ్వూరు, పోలవరం మండలాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వందల గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలెంలో జల్లేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. ఎర్రకాల్వ జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో వేల ఎకరాల్లో వరి, పొగాకు నారుమళ్లు దెబ్బతిన్నాయి. తడికలపూడిలో చేపల వేటకు వెళ్లి వాగులో పడి 55 సంవత్సరాల వ్యక్తి గల్లంతయ్యారు.

శ్రీకాకుళం జిల్లాలో..

అల్పపీడనం ప్రభావంతో.. శ్రీకాకుళం జిల్లా తడిసి ముద్దైంది. ఎడతెరిపి లేని వర్షాలకు తీర ప్రాంత ప్రజలు వణికిపోయారు. మత్స్యకారులను వేట వెళ్లొద్దని కలెక్టర్‌ ఆదేశించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వర్షపు నీరు నిలిచిపోవటంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. మెళియాపుట్టి మండలం గోకర్ణపురంలో సాగరం గెడ్డ ప్రవాహానికి శ్రీనివాసరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. పాతపట్నంలో మహేంద్రతనయ నదిలో గల్లంతైన వ్యక్తిని స్థానికులు రక్షించారు. నాగావళి, వంశధార ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలు ముంపునకు గురయ్యే ప్రమాదముందనిరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : నరసాపురం-కాకినాడ మధ్య తీరాన్ని దాటిన తీవ్రవాయుగుండం

Last Updated : Oct 13, 2020, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.