ETV Bharat / city

హార్ట్​ఫుల్​నెస్ ఇనిస్టిట్యూట్​ ఆధ్వర్యంలో 'వర్చువల్ యోగ' - yoga latest news

జూన్ 21 యోగా దినోత్సవం సందర్భంగా యోగ, ధ్యానం, సంగీతం కలగలిపి హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టి‌ట్యూట్, ఆయుష్ మంత్రాలయం సంయుక్తంగా హైదరాబాద్​లో వర్చ్యువల్ సమావేశం నిర్వహించనుంది.

heart fullness institute conduct verchual yoga in hyderabad
హార్ట్​ఫుల్​నెస్ ఇనిస్టిట్యూట్​ ఆధ్వర్యంలో 'వర్చువల్ యోగ'
author img

By

Published : Jun 20, 2020, 10:14 AM IST

యోగ, ధ్యానం, సంగీతం కలగలిపి హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టి‌ట్యూట్, ఆయుష్ మంత్రాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న వర్చ్యువల్ సమావేశం హైదరాబాద్​లో జూన్ 21న ఉదయం 7 గంటలకు జరగనుంది. యోగ మూల సూత్రం, అందరినీ ఒకటిగా చేయగలిగిన స్ఫూర్తి 'కరుణ'.

హార్ట్​ఫుల్​నెస్ ఇనిస్టిట్యూట్​ ఆధ్వర్యంలో 'వర్చువల్ యోగ'

ఈ కరుణా గుణాన్ని వ్యాపింపజేసేందుకు నిర్వహిస్తున్న ఈ సమ్మేళనంలో యోగర్షి బాబా రాందేవ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత శ్రీ పి.గోపీచంద్, ప్రఖ్యాత యువ క్రీడాకారిణి కుమారి పి.వి.సింధు, హార్ట్‌ఫుల్‌నెస్ గైడ్ శ్రీ కమలేష్ పటేల్ పాల్గొంటారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ వర్చ్యువల్ వేడుకలలో పాల్గొనవలసిందిగా అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టి‌ట్యూట్. ఈటీవీ భారత్ ఈ కార్యక్రమాన్ని ఆదివారం 21 ఉదయం 7గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించనుంది.

ఇదీ చూడండి: 'రెండు వారాల్లోనే మార్కెట్లోకి కరోనా మందు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.