ETV Bharat / city

Telangana: పాఠశాలల్లో భౌతికదూరం పాటించడం కష్టం కదా..?: హైకోర్టు - తెలంగాణలో పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో వాదనలు

తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హైకోర్టుకు వివరణ ఇచ్చారు. పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయపడింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు
author img

By

Published : Jun 23, 2021, 6:26 PM IST

తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా వివరణ ఇచ్చారు. అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని హైకోర్టు ప్రశ్నించగా.. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.

ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదన్న సందీప్ కుమార్ సుల్తానియా.. ఆన్​లైన్ బోధన కూడా కొనసాగుతుందన్నారు. విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు అభిప్రాయాన్నీ దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామని సుల్తానియా తెలిపారు. వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: JAGAN-CHIRU TWEETS: చిరంజీవి ట్వీట్​పై స్పందించిన జగన్​..ఏమన్నారంటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.