తెలంగాణ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో భూములు ఆక్రమించారనే ఆరోపణలను.. వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కొట్టిపారేశారు. తనపై విషపూరితంగా ప్రణాళికాబద్ధంగా... కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. జమునా హ్యాచరీస్ పెట్టాలని.. తాను 2017లోనే ఆలోచన చేశానని, అప్పుడు ఆరు లక్షల చొప్పున 40 ఎకరాలు, తర్వాత మరో 7 ఎకరాలు కొనుగోలు చేశామని ఈటల తెలిపారు. జమున హ్యాచరీస్ కోసం కెనరా బ్యాంకు నుంచి.. వంద కోట్లు రుణం తీసుకున్నట్టు తెలిపారు.
తర్వాత విస్తరణ కోసం ప్రయత్నిస్తే.... చుట్టూ అసైన్డ్ భూములు ఉన్నాయన్న ఈటల.... భూమి కోసం పరిశ్రమల శాఖకు దరఖాస్తు పెట్టినట్టు వివరించారు. ఈ విషయాన్ని.. సీఎంకు కూడా చెప్పినట్టు తెలిపారు. అసైన్డ్ దారులు సరెండర్ చేస్తే టీఎస్ఐఐసీ ద్వారా కేటాయించవచ్చని నర్సింగరావు అనే అధికారి చెప్పినట్టు.. ఈటల తెలిపారు. తర్వాత అచ్చంపేట రైతులే.. స్వచ్ఛందంగా భూములను స్వాధీనం చేశారని మంత్రి వివరించారు. తాత్కాలికంగా ధర్మం ఇబ్బంది పడినప్పటికీ.. అంతిమంగా ధర్మమే గెలుస్తుందని ఈటల స్పష్టంచేశారు.
ఇదీ చదవండి: ప్రతిధ్వని: వ్యాక్సినేషన్ అమెరికా అనుభవాలు