ETV Bharat / city

hc on social media posts: కేసు దర్యాప్తు చేస్తే సరిపోదు.. కట్టడి చేయాలి

author img

By

Published : Oct 7, 2021, 6:59 AM IST

Updated : Oct 7, 2021, 11:11 AM IST

సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయ మూర్తులపై అభ్యంతరకరంగా పోస్టింగ్​లు పెట్టిన నిందితులపై కేవలం కేసు దర్యాప్తునకే పరిమితం కాకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. వారిని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీబీఐని ఆదేశించింది.

hc on social media post
hc on social media post

సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, హైకోర్టు న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టిన నిందితులపై కేసు దర్యాప్తునకే పరిమితం కాకుండా .. భవిష్యత్తులో ఆ తరహా పోస్టులు పెట్టకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. న్యాయప్రతిష్ఠను దిగజారుస్తూ .. న్యాయమూర్తులకు కళంకం ఆపాదిస్తూ విదేశాల్లో ఉండి మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని విచారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సీబీఐకి స్పష్టంచేసింది. విదేశాల్లో ఉన్న నిందితులను విచారించేందుకు, భవిష్యత్తులో అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టకుండా చేసేందుకు ఏ విధంగా ముందుకెళతారో తెలియజేస్తూ నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. విదేశాల్లో ఉన్న నిందితులపై విచారణ వేగవంతం చేయడానికి తగిన సూచనలు చేస్తూ అనుబంధ పిటిషన్ వేసేందుకు హైకోర్టు రిజిస్ట్రీకి స్వేచ్ఛనిచ్చింది.

'పరస్పర న్యాయసహకార ఒప్పందం' ప్రకారం సీబీఐ దర్యాప్తునకు విదేశాలకు చెందిన సామాజిక మాధ్యమ కంపెనీల నోడల్ అధికారులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చాలని సూచించింది . సీబీఐ దర్యాప్తునకు సామాజిక మాధ్యమ కంపెనీల జవాబుదారీ అధికారులెవరో పరిశీలించాలంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ , కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ హరినాథ్ సహకారం అందించాలని పేర్కొంది . సీబీఐ కేసు నమోదు చేసినా పోస్టులు పెట్టడం ఆగలేదని పేర్కొంది. ఆ తరహా పోస్టులు న్యాయపాలనకు విఘాతం కలిగిస్తాని గుర్తు చేసింది. విచారణను ఈనెల 28 కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మల్య బాగ్చీ , జస్టిస్ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

నేపథ్యమిదే..

వివిధ వ్యాజ్యాల్లో తీర్పుల వెల్లడి అనంతరం ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా, తీవ్ర పదజాలంతో దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన పలువురిపై సీఐడీకి ఫిర్యాదు చేసినా చర్యలు లేవని పేర్కొంటూ హైకోర్టు అప్పటి ఇం​ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ వ్యాజ్యం దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం 2020 అక్టోబర్ 12న దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. తాజాగా ఈ వ్యాజ్యం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపించారు. సీల్డ్ కవర్లో దర్యాప్తు పురోగతిపై నాలుగో స్థాయి నివేదికను కోర్టు ముందు ఉంచామన్నారు. ఐదుగుర్ని అరెస్ట్ చేసి, వారిపై అభియోగపత్రాలు వేశామన్నారు. దర్యాప్తు పూర్తి చేయడానికి మరో మూడు నెలల సమయం పడుతుందన్నారు. నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. భారతదేశ పరిధిలో ఉన్న నిందితుల విషయంలో సీబీఐ దర్యాప్తు సంతృప్తికరంగా ఉందని పేర్కొంది. విదేశాల్లో ఉన్న వారిని విచారించే విషయంలో సీబీఐ విఫలమైందని వ్యాఖ్యానించింది. విదేశాల్లో ఉన్న నిందితుల్ని విచారించేందుకు సీబీఐ తీసుకున్న చర్యలు సరిపోవని తెలిపింది. సీబీఐ దర్యాప్తు వేగవంతం కావడానికి తగిన సూచనలు చేయాలని హైకోర్టు రిజిస్ట్రీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్​ను కోరింది.

సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టేయండి

న్యాయవ్యవస్థపై అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టాననే కారణంతో సీబీఐ తనపై నమోదు చేసిన కేసు క్రైం నంబర్ -26/2020 ను కొట్టేయాలని కోరుతూ గుంటూరు పట్టాభిపురానికి చెందిన నిందితుడు ఏ.శ్రీధర్​రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. అరెస్ట్ తో పాటు తదుపరి చర్యలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. కౌంటర్ వేయాలని సీబీఐని ఆదేశించారు . సీబీఐ నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది చిన్మయ్ ప్రదీప్ శర్మ వాదనలు వినిపించారు. రెండు ముఠాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే ఐపీసీ సెక్షన్ 505 ( 2 ) కింద కేసు నమోదు చేయాలన్నారు. పిటిషనర్ చర్యవల్ల అలాంటి ఘటన చోటు చేసుకోలేదన్నారు. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పిటిషనర్ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారని సీబీఐ తరపు న్యాయవాది చెన్నకేశవులు వాదనలు వినిపించారు. దర్యాప్తు వేగంగా జరుగుతోందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలన్నారు.

ఇదీ చదవండి: CM JAGAN: రాష్ట్రంలోనే అన్ని వ్యాధులకు చికిత్స అందించేలా చూడాలి: సీఎం జగన్

Last Updated : Oct 7, 2021, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.