అత్యల్ప సంఖ్యలో ప్రభుత్వ ఉత్తర్వులను ఏపీఈగెజిట్ వెబ్సైట్లో ఉంచేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 7న జారీచేసిన జీవో 100ను సవాల్ చేస్తూ తెలుగువన్.కామ్ ' డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది . పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ఐటీశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంతో ముడిపడి ఉన్న వాజ్యాలతో కలిసి ప్రస్తుత పిల్‌ను ఈనెల 27న విచారణ జరుపుతామని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి , జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి: DURGA TEMPLE: 'దుర్గమ్మ సన్నిధిలో సామాన్య భక్తులకు సౌకర్యాలు కల్పించరా?'