న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. అధికారుల్ని ఆశ్రయించకుండా నేరుగా ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. డిమాండ్ ఆఫ్ జస్టిస్ కోసం అధికారుల్ని ఆశ్రయింకుండా పిల్ దాఖలు చేసినా.. దానికి విచారణార్హత ఉండదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తంచేసింది. ఆరోపణలకు సంబంధించి వ్యాజ్యంలో సరైన వివరాలు సమర్పించలేదని పేర్కొంటూ వ్యాజ్యాన్ని కొట్టేసింది.
హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్ , జస్టిస్ బట్టు దేవానంద్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులిచ్చింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను గత ఎన్నికలకు ముందు దారి మళ్లించారని.. ఈ వ్యవహారంపై విచారణ జరిపేలా ఆదేశించాలని కోరుతూ ఏలూరు వాసి జి.శరత్ రెడ్డి గతేడాది జూలో పిల్ దాఖలు చేయగా ధర్మాసనం ఈవిధంగా స్పందించింది.
ఇదీ చదవండి: