ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పిల్లలు, ఉపాధ్యాయులు సమయానికి పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. అందుకోసం బయోమెట్రిక్ సిస్టమ్‌ను అప్డేట్ చేశామని వెల్లడించారు. జిల్లా అధికారులు బయోమెట్రిక్ హాజరును విధిగా తనిఖీ చేయడంతోపాటుగా పాఠశాలల్లో బయోమెట్రిక్ డివైజులు వినియోగం ఉన్నాయో లేవో తనిఖీ చేయాలని ఆదేశించారు.
బయోమెట్రిక్ డివైజుల వినియోగంలో అవకతవకలు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని 'జగనన్న గోరుముద్ద'ను పిల్లలందరికీ ఒకేసారి కాకుండా కొద్ది మంది చొప్పున.. భౌతిక దూరం పాటిస్తూ వడ్డించాలని సూచించారు.
ఇదీ చదవండి: