ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవటం వల్లే.. అవి ఆలస్యమవుతున్నాయని భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ మోహనరాజాతో సమావేశమయ్యారు. డివిజన్ పరిధిలో రైల్వే ప్రాజెక్టుల పురోగోతి, స్టేషన్లలో సౌకర్యాలపై చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. మోదీ సారథ్యంలో 8లక్షల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా రైల్వేల అభివృద్ధి జరుగుతోందన్నారు. గుంటూరు డివిజన్ పరిధిలో రైల్వే అభివృద్ధి కోసం తన వంతుగా రూ.50లక్షల ఎంపీ లాడ్స్ నుంచి కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎంతో కీలకమైన గుంటూరు గుంతకల్లు డబ్లింగ్, విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు పూర్తిగా కేంద్రమే నిధులు ఇచ్చిందన్నారు. అయితే ఇతర ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటా ఇవ్వకపోవటం వల్ల పనులు ముందుకు సాగడం లేదని విమర్శించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఏపీ ప్రభుత్వం తన వాటాను చెల్లిస్తే రైల్వే అభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: