తెదేపా నేతలపై కేసులు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి తన అసమర్థతను, చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకుంటున్నారని తెదేపా సీనియర్ నేత జీ.వీ.ఆంజనేయులు విమర్శించారు. ప్రజలను కాపాడలేని ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. ప్రతిపక్షనేతపై కేసులు పెట్టడమేంటని నిలదీశారు. నిత్యం వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నందుకు ఈ ముఖ్యమంత్రి.. ఆయన ప్రభుత్వం సిగ్గుపడాలని ధ్వజమెత్తారు.
ప్రజలకు జాగ్రత్తలు చెబితే, చంద్రబాబుపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 151సీట్లు ఇచ్చింది వారి ప్రాణాలు కాపాడతారనే తప్ప ప్రతిపక్షనేతలపై వేధింపులకు పాల్పడటానికి కాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి తక్షణమే చంద్రబాబుపై, లోకేశ్, ఇతర తెదేపా నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సీఎం ఇంటిని ముట్టడించి, తెదేపా సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి
హైదరాబాద్కు కర్నూలు పోలీసులు.. చంద్రబాబుకు నోటీసులిచ్చే అవకాశం!