పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖలో చేసిన వ్యాఖ్యలు, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ పోస్టులు... రాజధానిని అమరావతి నుంచి తరలించే కుట్రలో భాగమని తెదేపా గుంటూరు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఎగువ నుంచి వస్తోన్న వరదను కట్టడి చేయకుండా కావాలనే అమరావతిని ముంపునకు గురిచేశారన్నారు. వరద ముంపుతో ఈ ప్రాంతం రాజధానికి అనువైనది కాదని వైకాపా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటును వైకాపా ముందు నుంచి వ్యతిరేకించిందని పేర్కొన్నారు. వేల మందికి ఉపాధి కల్పిస్తున్న రాజధానిని మార్చే ఆలోచన మానుకోవాలని హితవు పలికారు.
ఇదీ చదవండి: