ETV Bharat / city

తెలంగాణ : స్పందించారు.. వృద్ధురాలిని తమతో తీసుకెళ్లారు..!

అనారోగ్యంతో ఉన్న వృద్ధురాలైన తల్లిని ఆస్పత్రిలో చూపిస్తానని తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బస్టాండ్ సమీపంలో వదిలేసిన ఘటనకు సంబంధించి ఈనాడు-ఈటీవీ భారత్​ కథనానికి స్పందన వచ్చింది. వృద్ధురాలి మనవళ్లు సోమవారం సాయంత్రం పోలీస్​ స్టేషన్​కు వచ్చి ఆమెను తీసుకెళ్లారు.

grand-sons-taken-grand-mother-in-yadadri-bhuvagiri-district
ఇంటికి తీసుకెళ్లేందుకు వృద్ధురాలి కుటుంబ సభ్యులు
author img

By

Published : Jul 7, 2020, 7:18 AM IST

నడవలేని స్థితిలో ఉన్న తల్లిని ఆస్పత్రిలో చూపిస్తానని చెప్పి ఒంటరిగా వదిలేశారు. సమాచారం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి పోలీసులు ఆ వృద్ధురాలికి చికిత్స అందించారు. ఇదే విషయమై ఈనాడు-ఈటీవీ భారత్​లో కథనం ప్రచురింతమైంది. కథనానికి స్పందించిన ఆమె మనవళ్లు వృద్ధురాలిని తీసుకెళ్లేందుకు సోమవారం సాయంత్రం భువనగిరి పోలీస్ స్టేషన్​కి వచ్చారు.

పోలీసులు, జిల్లా మహిళా శిశు, వయోవృద్ధుల శాఖ ఉద్యోగులు, అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆమెను వారి మనవళ్లకు అప్పగించారు. ఆమెను బాగానే చూసుకున్నామని మనుమడు నగేశ్​ చెప్పాడు. వృద్ధురాలు చెప్పినట్లు రూ.40 వేలు తాము తీసుకోలేదన్నారు.

ఇదీ చూడండి:

సరోజినమ్మ సేద్యం... కౌలు భూమిలో ప్రకృతి వ్యవసాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.