పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని గోదావరి నదీ తీరప్రాంతాల్లో వరద బాధితులకు రూ.2 వేల తక్షణ సాయాన్ని చెల్లించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గోదావరి వరద ప్రభావాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణ సాయంగా రెండు వేల రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు బాధితులకు చెల్లించాల్సిందిగా.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరకులు ఇవ్వటంతోపాటు షెల్టర్లలోనూ భోజనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: జలవివాదాలపై ఈనెల 25న అపెక్స్ కౌన్సిల్ సమావేశం