ETV Bharat / city

జాతీయ అవార్డులు సాధించిన చిత్ర బృందాలకు గవర్నర్ అభినందన

జాతీయ స్థాయి అవార్డులు సాధించిన చిత్ర బృందాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జెర్సీ... జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకోవటం పట్ల బిశ్వభూషణ్ సంతోషం వ్యక్తం చేశారు.

Governor Greetings to Telegu cinema Industry

author img

By

Published : Mar 23, 2021, 5:18 PM IST

జాతీయ స్థాయి అవార్డులు సాధించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమను, అయా చిత్ర బృందాలను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమా తన ప్రత్యేకతను నిలుపుకోగా... 2019 సంవత్సరానికి నాలుగు పురస్కారాలను సొంతం చేసుకుందన్నారు. కేవలం కథలే కాకుండా సాంకేతికంగా తెలుగు సినిమా పురోగతిని సాధించటానికి నిదర్శంగా అవార్డులు పొందటం శుభపరిణామమని గవర్నర్ అన్నారు.

ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘జెర్సీ'... జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకోవటం పట్ల బిశ్వభూషణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తమ నృత్య దర్శకత్వం (మహర్షి), ఉత్తమ ఎడిటింగ్‌ (జెర్సీ) విభాగాల్లో జాతీయ పురస్కారాలు దక్కటం తెలుగు సినిమా గొప్పతనాన్ని వెల్లడిస్తుందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కొత్త ఎస్‌ఈసీ కోసం గవర్నర్‌కు మూడు పేర్లు సిఫారసు చేసిన ప్రభుత్వం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.