ETV Bharat / city

'ప్రభుత్వ ఫలాలు దూదేకులకు దక్కడం లేదు' - dudekula community problems news

దూదేకుల సామాజిక వర్గానికి చెందిన వారికి జారీచేసే బదిలీ ధ్రువీకరణ పత్రాల్లో ముస్లింలుగా పేర్కొనాలని కోరుతూ.. హైకోర్టులో పిల్ దాఖలైంది. గుంటూరుకు చెందిన షేక్ ఖాజావలి నూర్ బాషా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలన్న హైకోర్టు.. విచారణను వాయిదా వేసింది.

'ప్రభుత్వ ఫలాలు దూదేకులకు దక్కడం లేదు'
'ప్రభుత్వ ఫలాలు దూదేకులకు దక్కడం లేదు'
author img

By

Published : Nov 6, 2020, 4:59 AM IST

విద్యాలయాలు దూదేకుల సామాజిక వర్గానికి చెందిన వారికి జారీచేసే బదిలీ ధ్రువీకరణ పత్రాల్లో.. ముస్లింలుగా పేర్కొనాలని కోరుతూ.. హైకోర్టులో పిల్ దాఖలైంది. గుంటూరుకు చెందిన షేక్ ఖాజావలి నూర్ బాషా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ టి.రజనీతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. న్యాయవాది వైకే వాదనలు వినిపించారు.

దూదేకులు, నూర్ బాషాలుగా పిలుస్తున్న వారి కుల ధ్రువీకరణ, టీసీల్లో హిందువులుగా పేర్కొంటున్నారన్నారు. దీంతో మైనార్టీ ముస్లింలకు ఇచ్చే ప్రభుత్వ ఫలాలు దూదేకులకు దక్కడం లేదని చెప్పారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని 'మతం' స్థానంలో వారిని ముస్లింలుగా పేర్కొనేలా ఆదేశించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. వినతి సమర్పించామన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.

ఇదీ చదవండీ... కేబినెట్ నిర్ణయాలు: రూ. వెయ్యి కోట్లతో భూముల సమగ్ర రీ సర్వే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.