ETV Bharat / city

రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కొరత..

author img

By

Published : Aug 14, 2021, 5:55 AM IST

ప్రాజెక్టుల నిర్వహణను ఏళ్లతరబడి గాలికి వదిలేశారు. చిన్న చిన్న పనులకూ నిధులు ఇవ్వడం లేదు. ఒకవేళ పనులు ప్రారంభించి చేయడం మొదలుపెడితే బిల్లులు సకాలంలో చెల్లించట్లేదు. దీంతో నిర్వహణ పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఒకటీ, రెండూ కాదు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్టుల్లో నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కావడం లేదు.

ప్రాజెక్టుల నిర్వహణ
ప్రాజెక్టుల నిర్వహణ

ప్రాజెక్టుల నిర్వహణను ఏళ్లతరబడి గాలికి వదిలేశారు. చిన్న చిన్న పనులకూ నిధులు ఇవ్వడం లేదు. ఒకవేళ పనులు ప్రారంభించి చేయడం మొదలుపెడితే బిల్లులు సకాలంలో చెల్లించట్లేదు. దీంతో నిర్వహణ పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఒకటీ, రెండూ కాదు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్టుల్లో నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కావడం లేదు. దీంతో వరదల సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధాన డ్యాంలలో నిర్వహణ పనులు కూడా గతంలో నీరు-చెట్టు కింద ప్రతిపాదించి చేపట్టిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటికీ అనేకచోట్ల నిధులు ఆగిపోవడంతో పనులూ మూలనపడ్డాయి.
పులిచింతల ప్రాజెక్టులో అనేక నిర్వహణ లోపాలున్నాయి. పైగా గేట్ల నిర్వహణకు అవసరమైన కాలినడక వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. మొత్తం 24 గేట్లు ఇక్కడ ఉంటే 12 గేట్ల వరకే వంతెన ఏర్పాటుచేశారు. దీంతో తాజాగా విరిగిన 16వ గేటు వద్దకు వెళ్లి పూర్తిస్థాయిలో నిపుణులు పరిశీలించేందుకు వీల్లేని పరిస్థితి ఉంది. నిపుణుల్లో చాలామంది విశ్రాంత ఇంజినీర్లే. వారి వయసు ఎక్కువ. కాలినడక వంతెనలు లేకపోతే ప్రాజెక్టుల పరిశీలన ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. పులిచింతలలో రూ.3 కోట్లతో ఆ వంతెన పనులు చేపట్టినా నిధులు లేక ఆగిపోయింది. ప్రాజెక్టుకు పాలనామోదం ఇచ్చిన నిధుల్లోనే ఈ పని చేపట్టవచ్చని భావించారు. అందుకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ పని కోసం మళ్లీ ప్రత్యేకంగా పాలనామోదం పొందవలసి ఉంది.
*గాజులదిన్నె ప్రాజెక్టులో రూ.2 కోట్లతో మరమ్మతుల పనులను చేపట్టారు. 1.50 కోట్లు విడుదలైనా మిగిలినవి రాలేదు.
* వెలిగల్లు ప్రాజెక్టులో రబ్బరు సీలు, గ్రీజుల వంటి నిర్వహణ పనులకు రూ.70 లక్షలు ఖర్చుచేసినా ఆ నిధులు రాలేదు.
*అన్నమయ్య ప్రాజెక్టులోనూ గేట్ల మరమ్మతులు చేపట్టినా నిధులు విడుదల కాలేదు.
* ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి నిర్వహణ పనులను రూ.3 కోట్లతో చేపట్టినా నిధులు పెండింగులోనే ఉన్నాయి.

ఎర్రకాలువ మూడేళ్ల నాటి వ్యథ

పశ్చిమగోదావరి జిల్లా ఎర్రకాలువ జలాశయం ప్రాజెక్టు జంగారెడ్డిగూడెం మండలం కొంగురవారిగూడెంలో ఉంది. 2.82 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. మూడేళ్ల కిందట భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రవాహాలు వచ్చాయి. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేద్దామంటే రెండు గేట్లు తెరుచుకోలేదు. దీంతో జలాశయం కుడి గట్టుకు గండి పడే ప్రమాదం ఏర్పడింది. దాదాపు 50 గ్రామాలను వరద ముంచెత్తే పరిస్థితి. ఇంతలో సర్‌ప్లస్‌ ఛానల్‌కు గండి పడింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికీ నిర్వహణకు నిధులు మంజూరు కాలేదు. రూ.40 లక్షలతో ప్రాజెక్టు నిర్వహణ పనులకు ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ నిధులు మంజూరు కాలేదు.
* ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు డెల్టా ప్రాంతాల్లో వందల కిలోమీటర్ల పొడవునా ఉన్న లాకులు, తలుపులు పాతబడిపోయినా, తుప్పుపట్టి కనిపిస్తున్నా మరమ్మతులకు నిధులిచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకూ సమస్యలే

ఆంధ్రప్రదేశ్‌లో మధ్యతరహా, చిన్నతరహా ప్రాజెక్టులెన్నింటిదో ఇదే పరిస్థితి. మెకానికల్‌ పనులు, చిన్నస్థాయి మరమ్మతులు, గ్రీజు పెట్టడం వంటి చిన్న పనులూ సరిగా జరగడం లేదు. ప్రతి ఏటా రబీ సాగు తర్వాత వేసవిలో నిర్వహణ పనులు చేపడతారు. పెద్ద ప్రాజెక్టులకే నిధులు విడుదల కావట్లేదు. ఇక మధ్యతరహా ప్రాజెక్టులకు నిధులెక్కడివని ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో శ్రీశైలం, పులిచింతల, సోమశిల, కండలేరు, వెలిగోడు వంటి భారీ ప్రాజెక్టులతో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు 71 వరకు ఉన్నాయి. అనేక చిన్నతరహా ప్రాజెక్టులు- పెద్ద చెరువులు సైతం నిర్వహణ ముఖ్యమైనా ఆ లక్షణాలు కనిపించడం లేదు.

అసలే నిర్లక్ష్యం...ఆపై కరోనా!

ఏటా వరదలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల్లో అవసరమైన పనులు చేసుకోవాలి. రాష్ట్రంలో మెకానికల్‌ వర్కుషాపుల ఆధ్వర్యంలో ఉన్న ఉన్నతాధికారులు, మెకానికల్‌ ఇంజినీర్లు ఏడాదికి రెండుసార్లు ఈ ప్రాజెక్టులనుతనిఖీచేసి చేయాల్సిన పనులపై ఈఈలకు నివేదికలు ఇస్తుంటారు. కొన్నేళ్లుగా ఈ తనిఖీలు సక్రమంగా జరగడం లేదని చెబుతున్నారు.
* కేంద్ర ఆకృతుల సంస్థ ఆధ్వర్యంలో డ్యాం భద్రతా కమిటీలు కూడా ప్రాజెక్టులను క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మస్థాయి నివేదికలు ఇస్తాయి. ఈ కమిటీ ప్రతి ప్రాజెక్టునూ పరిశీలించకపోయినా ఆయా ప్రాజెక్టుల ఉన్నతాధికారుల వినతి మేరకు వచ్చి ప్రాజెక్టులను పరిశీలించి నివేదికలు ఇస్తాయి. వాటి ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలూ ఆలస్యం అవుతున్నాయనే విమర్శ ఉంది.
* కొన్ని ప్రాజెక్టుల్లో గేట్లున్నా నీరు లీకవుతోంది. గేట్లు ఎత్తేందుకు ఉండే హోయిస్టులు సరిగా పని చేయడం లేదు. బేరింగులు మార్చడం లేదు. కనీసం గ్రీజు పెట్టే నాధుడూ లేడు.
* వరదల సమయంలో, వర్షాల సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోతుంది. జనరేటర్లు సిద్ధం చేసుకోవాలి. సరైన సమయానికి బ్యాటరీ పనిచేయక ఇబ్బందులు పడ్డ ఉదాహరణలూ చెబుతున్నారు. వాటిపై అవగాహన ఉన్న సిబ్బంది అందుబాటులో లేరు.

ఇదీ చదవండి:

CS Meeting with IAS officers: 'ఐఏఎస్ అధికారులూ.. సచివాలయానికి రండి!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.